ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ నుంచి వలసలు ఆ పార్టీ కి తలనొప్పులుగా మారాయి . ఇప్పటికే ఆమంచి పార్టీ మారటానికి అన్ని విధాలా సిద్ధం అయ్యాడు. ఇంకొక పక్క కడప ఏకైక ఎమ్మెల్యే వైస్సార్సీపీ పార్టీ తీర్ధం పుచ్చు కున్నాడు. అయితే 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. ఆమంచి కృష్ణమోహన్‌ మొదటినుంచీ ఒకింత దుందుడుకు స్వభావం గల వ్యక్తి. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆయన పేరు విన్పిస్తుంటుంది. అలాంటి ఆమంచి, తెలుగుదేశం పార్టీపై గుస్సా అయ్యారు.. అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకున్నారు.

Image result for chandrababu naidu

వైఎస్సార్సీపీలో ఆమంచి చేరుతున్నారనగానే, చంద్రబాబు ఆందోళన చెంది మంత్రుల్ని రంగంలోకి దించారు. ఆమంచి 'గొంతెమ్మ కోర్కెలు' ఏంటో తెలుసుకోవాలని పంపించారు. ఇంకేముంది, చంద్రబాబు చెప్పినట్లే మంత్రులు చేశారు. తొలుత ఆమంచి బెట్టుచేసినా, తెరవెనుక చాలా వ్యవహారాల్ని చంద్రబాబు చక్కబెట్టించేసరికి.. ఆమంచి, చంద్రబాబుని కలిసేందుకు ఒప్పుకున్నారు. అయినా, చంద్రబాబుతో భేటీలో ఆమంచి ముభావంగానే వ్యవహరించారట.

అయినా చంద్రబాబుకి లొంగని ఆమంచి.?

'పార్టీ మారాల్సిందే.. పరిస్థితులు ఏమీ బాగాలేవు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదు.. ఆ పార్టీని నమ్ముకుంటే నాకూ రాజకీయ భవిష్యత్తు వుండదు..' అంటూ ఇప్పటికే సన్నిహితుల వద్ద తేల్చేసిన ఆమంచి, అదే అభిప్రాయాన్ని పరోక్షంగా మీడియా ముందు కూడా తాజాగా వెల్లడించడం గమనార్హం. ఆమంచిని పార్టీలో వుంచేందుకు చంద్రబాబు చివరి ప్రయత్నాలు చేశారనీ, అయినా ఆయన మాట వినకపోతే చేసేదేమీ లేదని ఆమంచితో సంప్రదింపులు జరిపిన ఓ మంత్రిగారు తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. అయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని వీడేందుకు చాలామంది ముందుకొస్తారు గనుక... అందర్నీ బుజ్జగించడం తమవల్ల కావడంలేదనీ సదరు మంత్రిగారు మీడియాకి లీకులు పంపుతుండడం కొసమెరుపు ఇక్కడ. 

మరింత సమాచారం తెలుసుకోండి: