ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కల్తీ మద్యం కలకలం రేపింది. దాన్ని తాగిన సుమారు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌, ఖుషీనగర్‌ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 16 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది అధికారులను సస్పెండ్‌ చేశామని ఖుషీనగర్‌ జిల్లా మేజిస్ర్టేట్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. కాగా, కల్తీ మద్యం సేవించిన బాధితులకు తక్షణం వైద్య సాయం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌ అధికారులను కోరారు.

ఎంత ఘోరం..! 30మందిని కాటేసిన కల్తీ మద్యం..!!

మృతుల కుటుంబాలకు రూ రెండు లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు.  యూపీలో మృతి చెందిన 16 మందిలో ఎనిమిది మంది ఖుషీనగర్‌కు చెందిన వారు కాగా మరో ఎనిమిది మంది షాహారాన్‌పూర్‌కు చెందిన వారు ఉన్నారు. వీరంతో రెండు రోజుల‌క్రితం ఆయా గ్రామాల్లో జ‌రిగిన వేడుక‌ల్లో కల్తీ మద్యం సేవించడంతో పలువురు తీవ్ర అస్వస్ధతకు గురవగా, మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్తీ మద్యం సేవించిన ఘటనకు సంబంధించి రెండు జిల్లాల్లో బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి, డీజీపీలను ఆదేశించారు.


రెండు రోజుల క్రితం ఈ  గ్రామాల్లో జరిగిన వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో స్ధానికులు కల్తీ మద్యం సేవించడంతో పలువురు తీవ్ర అస్వస్ధతకు గురవగా, మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోనూ ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. రూఢ్‌కీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కల్తీ మద్యం తాగి సుమారు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్ర అస్వస్థతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: