తెలుగుదేశంపార్టీ నేతల వ్యవహారం బాగా శృతిమించి పోతోంది. ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇస్తున్న పసుపు కుంకుమ చెక్కుల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు. అదేదో తమ సొంత డబ్బులిస్తున్నట్లు, వారికోసం జేబులోని డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ సందర్భంగా ఎక్కడికక్కడ మంత్రులు, నేతలు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో డ్వాక్రా మహిళలను బాగా అవమానించారు.

 

డ్వాక్రా మహిళలకు రూ 10 వేల చెక్కు, చీర, గొడుగు కావాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకే ఓట్లేస్తామని ప్రమాణం చేయాల్సిందేనంటూ నిర్బింధించటం వివాదాస్పదమైంది. చెక్కులిస్తాం రమ్మంటు అధికారులు నర్సీపట్నంలోని 26వ వార్డులో డ్వాక్రా సంఘాల మహిళలను పిలిపించారు. అక్కడకు మంత్రి కొడుకు రాజేష్ కూడా చేరుకున్నారు. రాజేష్ చేతుల మీదగా చెక్కులు, చీర, గొడుగు పంపిణీ జరుగుతందని ప్రకటించారు. నిజానికి రాజేష్ కు మంత్రి కొడుకన్న హోదా తప్ప మరే పదవీ లేదు.

 

అయినా పంపిణీ చేసేది ఎవరైతే మనకేంటిలే అనుకుని డ్వాక్రా మహిళలు కూడా చేరుకున్నారు. అయితే, సమావేశం మొదలవ్వగానే మహిళలందరూ టిడిపికే ఓట్లేస్తామని ప్రమాణం చేయిస్తే కానీ చెక్కులు, చీరలు, గొడుగు ఇవ్వమని కండీషన్ పెట్టారు. ప్రమాణం చేయటానికి మహిళలు ముందు ఇష్టపడలేదు. అయితే, టిడిపి నేతలు ఒకవిధంగా నిర్బంధించటంతో చేసేది లేక నేతలు చెప్పినట్లే చేతులు ముందుకు చాపి ప్రమాణం చేశారు. అయినా టిడిపి నేతల పిచ్చికానీ ఇపుడు నిర్బంధంగా ప్రమాణాలు చేయించినంత మాత్రాన రేపటి ఎన్నికల్లో టిడిపికే ఓట్లు వేస్తారని ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: