ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష గురించి ఇప్పటికే ప్రజలకు సంపూర్ణ సమాచారం ఉంది. అందుకే మళ్ళా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగానే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం నాటకం రక్తి  కట్టించారని పక్కాగా చెప్పవచ్చు. చంద్రబాబుకు అన్నింటా ప్రత్యేక లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో అనేక జిమ్మిక్కులే కాదు మాజిక్కులు మాయలూ ఉండటం సహజం.. చంద్రబాబు చూపు ప్రత్యేక హోదా మీద ఏ మాత్రం లేదు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ నాటకాలు అని చూసే ప్రతీ ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతోందని  అనుకుంటున్నరు. అయితే ఈ దీక్షలో చంద్రబాబు చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు చంద్రబాబు పప్పులో కాదు ఏకంగా కంపలో కాలేశారు. అదే హస్థిన సాక్షిగా పరువు తీసుకున్నారు.

divyavani sivaji chandrababu కోసం చిత్ర ఫలితం 

ఢిల్లీలో జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేక్షంగా చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష అంటూ ధర్నాలు నిరసనలు చేపట్టారు. అందుకు చంద్రబాబుకి మద్దతుగా జాతీయ స్థాయి నేతలు కూడా మద్దతు పలికారు. కాని చంద్రబాబు మాత్రం దీక్షలో తనకే ప్రత్యేకమైన అలగా మాయలు చేయడం పలితంగా ఆ దీక్ష కాస్తా మురుగు కాలవలో పోసిన పన్నీరు అయ్యింది. ఇది చంద్రబాబు స్కెచ్ ప్రకారం జరిగిందా? లేక మరెవరన్నా దారిమళ్లించారా? అనేది తెలియదు కాని, మొత్తానికి దీక్షపై నెగిటివ్ టాక్ మాత్రం వచ్చేసింది. జాతీయ స్థాయి నేతలు వేదిక మీదకి వచ్చినపుడు ఆ వేదిక పైకి చలసాని శ్రినివాస్, శొంఠినేని శివాజీ కనిపించగా వారెవరో తెలియక వారంతా కంఫ్యూజ్డ్ గా కనిపించారు. 

divyavani sivaji chandrababu కోసం చిత్ర ఫలితం 

శొంఠినేని శివాజీ లాంటి రాజకీయాల్లో ఊరూ పేరు లేనివాడిని ధర్మపోరాట దీక్ష వేదికమీదకు తీసువచ్చి నరెంద్రమోడీని బీజేపీని తిట్టించడం వారికి హుందాగా కనిపించక ఎంతో హాస్యాస్పదమైంది.

 divyavani sivaji chandrababu కోసం చిత్ర ఫలితం

దీనికి మించి గతకాలం సినీనటి నేటి బుల్లితెర నటి దివ్యవాణి, కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు మైక్ దొరకగానే నరేంద్ర మోడీని తిట్టటం మొదలు పెట్టడంతో - ఒక స్థాయి నాగరికత భాష ఙ్జానం లేని వాళ్ళని డిల్లీ తీసుకొచ్చి అంత పెద్ద వేదికపై రికార్డింగ్ డాన్స్ చేయించగా చంద్రబాబు పరువు ప్రతిష్ఠ మొత్తం తుస్సుమంది. దివ్యవాణి జాతీయ వేదికపై హద్దులు మీరి మాట్లాడటం, నోటికి వచ్చిన అసహ్యకరమైన బాష వాడటంతో - బీజేపీ నేత ,ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుకి సైతం సవాల్ విసిరారు. బెజవాడ వచ్చి తిరిగి వెళ్ళగలవా? అంటూ ఆమె చేసిన సవాల్లతో అది "ఢిల్లీ సభా! లేక గల్లీ సభా!" అనే సందేహం కలిగింది. 

 divyavani sivaji chandrababu కోసం చిత్ర ఫలితం

ఈ రాహుల్ గాంధి మహానుభావుని తల్లి సోనియా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రాన్ని అడ్డంగా కొసేస్తే ఇప్పుడు ఈయన అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తాడట. అత్యంత ఆధిఖ్యత ఉన్న బిజేపి యే ఇవ్వలేని ప్రత్యేక హోదా ఇవ్వటం యశస్వి నందమూరి తారక రామా రావు అన్నట్లు ఈ కుక్కమూతి పిందె కు సాధ్యమా! అనేది రాష్ట్ర ప్రజల భావన. ఆయన్ని పట్టుకొని పీకులాడుతున్నందుకే రేపు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ని రాష్ట్రప్రజలు బంగాళా ఖాతంలోకి తోసేయటానికి నిరీక్షిస్తున్నారని వాళ్ళే అంటున్నారు! జస్ట్ వెయిటింగ్!  

divyavani sivaji chandrababu కోసం చిత్ర ఫలితం

వేదిక మీద ఉన్న అధికారులని ఆమె సంబోధించారు! తొందరలో ఇందిరా గాంధిని తిట్టేసింది! రాహుల్ గాంధికి కూడా! ఈయన ఎన్టీఆర్ కు వెన్నుపోటేసిన రోజున ఈమె పుట్టలేదు. అలాంటి మసికం మోడీని నిందించటం తిట్టటం చంద్రబాబు పరువు ఆమె పరువు పోయింది.    


ఢిల్లీ అనేది దేశ రాజధాని అని చంద్రబాబు మరిచిపోగా, శివాజీ, దివ్యవాణి లాంటి వ్యక్తులతో మాట్లాడించాలంటే ఢిల్లీ దాకా వెళ్ళాలా? విజయవాడ గల్లీలే వీరి కెపాసిటీకి తక్కువ కదా! అంటూ టీడీపీపై సెటైర్లు వచ్చిపడుతున్నాయి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు పదే పదే మీ వేషాలని నాటకాలని నమ్మడానికి. మీరు ఢిల్లీలో చేసిన మీ పార్టీకే స్వంతమైన డ్రామా అంతా పక్కా స్క్రిప్ట్  ప్రకారం నడిచిన వ్యవహారంలా వుంది తప్ప, నిజాయితీగా ఏపీ ప్రజలకోసం చేస్తున్న దీక్షలా ఎక్కడా కనిపించలేదు అంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

అయినా ఢిల్లీ దీక్ష అంటే, మంచి వాగ్ధాటి కలిగిన నేతల్ని ఎంచుకుని, లెక్కలతో సహా మాట్లాడించి ఉంటే ఈ దీక్షకి మంచి మైలేజ్ వచ్చేది. అంతే కాదు ఆ ప్రసంగాలు కూడా ఇంగ్లీషు, హిందీ లో ఉండి ఉంటే - జాతీయ స్థాయిలో ఏపీ కోసం టీడీపీ చేస్తున్న పోరాటానికి గుర్తింపు వచ్చేది. అవన్నీ వదిలేసి శివాజీ, దివ్యవాణి లాంటి వాళ్ళతో తెలుగులో అడ్డదిడ్డంగా మాట్లాడిస్తే అసహ్యంగా వినిపించింది అక్కడ వాళ్లకు. చంద్రబాబు ఇంద్రప్రస్థ దీక్షకి అతి పెద్ద నష్టం తెచ్చి పెట్టిందని గుసగుసలాడుతున్నారు సొంత పార్టీ నేతలే! .

మరింత సమాచారం తెలుసుకోండి: