ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వేడెక్కి పోతున్న విషయం తెలిసిందే.  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్య పార్టీ నేతలు ప్రచారంలో మునిగిపోయారు.  అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది పనులను చూసి ప్రజలకు ఓటు వేస్తారని..ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారని..మరొక్కసారి ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ సిటిగా చేస్తామని హామీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఇక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ గత నాలుగేళ్లలో ఏమీ చేయని ప్రభుత్వం మరోసారి గెలిస్తే మొత్తం దోచేస్తుందని..ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని ప్రశ్నిస్తుంది. 
Image result for ys jagan family
కొత్తగా వచ్చిన జనసేన పార్టీ సైతం అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు.  అయితే ఏపిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో జైలు శిక్ష అనుభించిన తర్వాత బెయిల్ పై వచ్చిన విషయం తెలిసిదే.  ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఆయన సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు.  నేడు వైఎస్ జగన్  సీబీఐ కోర్టుకు హాజరయ్యారు‌.
Image result for ys jagan family
ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సీబీఐ కోర్టు ప్రిన్సిపాల్‌ జడ్జిగా జస్టిస్‌ మధుసూధన్ రావు ఈ రోజు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో కేసు విచారణను వచ్చే శుక్రవారంకు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే..సీబీఐ కోర్టులో జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురుని చూసేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని  కోరుతూ జగన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫిబ్రవరి18 నుంచి మార్చి 18 లోపు ఒక వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు జగన్ కు అనుమతినిచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: