2019 ఎన్నికలు దగ్గర కు వస్తుండటం తో ఇప్పటికే ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు పార్టీ మారటానికి సిద్ధం అయిపోయారు. అయితే వీరు పార్టీ మారటానికి కారణాలు లేకపోలేదు. ప్రతీ ఎంపీ - ఎమ్మెల్యే.. ఎన్నికలకు ఆరు నెలల ముందే తన నియోజకవర్గంలో సర్వేలు చేయించుకుంటాడు. ప్రభుత్వం పనీతీరు ఎలాఉంది - అప్పోజిషన్ ఎలా ఉంది - ప్రజలు ఈ సారి ఎవరి పక్షాల నిలబడేందుకు అవకాశం ఉంది లాంటి అంశాలన్నింటికి బేరీజు వేసుకుని లెక్కలు కడతాడు.


ఆ ఒక్క గుణం జగన్ ను మంచి లీడర్ గా నిలబెట్టింది ..!

ఈ లెక్కలు అధికారపక్షానికి అనుకూలంగా ఉంటే అందులోనే ఉండిపోతారు. తేడాగా ఉండే పార్టీ మారతారు. ఇది ఒక లాజిక్. ఇక అధినేత తమకు సీటు ఇచ్చే అవకాశం లేదని ఉప్పందినా సరే..  వెంటనే పార్టీ మారిపోతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే సీటు తెచ్చుకోకపోతే అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. ఇక ఇంకొంతమంది మాత్రం ఎంపీగా పోటీ చేయాలనో - ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో పార్టీగా మారతారు. 


ఆ ఒక్క గుణం జగన్ ను మంచి లీడర్ గా నిలబెట్టింది ..!

అన్నింటికి మించి.. ఇప్పుడు టీడీపీ లీడర్లు అందరూ పార్టీ వదిలి వెళ్లిపోవడానికి అసలు రీజన్ సర్వేలే. లోకల్ నుంచి జాతీయ స్థాయి వరకు అన్నీ సర్వేలు జగన్ కు అనూకూలంగా వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో వైసీపీలోకి వెళ్తే.. గెలిచినా ఓడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే.. టీడీపీలో ఇబ్బందులు పడుతున్న రాజకీయ నేతలంతా.. ఇప్పుడు జగన్ వైపు వెళ్లిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: