టారిజం పలు రకాలు.. హిస్టారికల్ టూరిజం.. వెదర్ టూరిజం.. హెల్త్ టూరిజం.. కేసినో టూరిజం.. ఇలా ఎన్నో రకాలు.. మనం వెళ్లే కారణాన్ని బట్టి టూరిజం ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ టూరిజం అనే మాట విన్నారా. బహుశా విని ఉండరు. నిజంగా ఇలాంటిది ఉంటుందా అని కూడా అనిపిస్తుంది.

brokpa pregnancy tourism కోసం చిత్ర ఫలితం


అవును నిజమే.. ప్రెగ్నెన్సీ టూరిజం అంటే.. ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ గర్భం దాల్చి మళ్లీ సొంత ప్రాంతానికి రావడం. ప్రత్యేకించి గర్భం దాల్చడం కోసం అక్కడికి వెళ్లడం ఎందుకంటారా. గర్భం దాల్చేదే ఆ ప్రాంతానికి చెందిన పురుషులతో.. ఇదే ఇక్కడి హైలెట్ పాయింట్.

సంబంధిత చిత్రం


హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్ పరిసర ప్రాంతల్లో ఇది జరుగుతోంది. ఇక్కడి గ్రామాల్లో బ్రోక్పా అనే హిమాలయన తెగ ఉంది. విదేశాల నుంచి ఎందరో మహిళలు ఇక్కడికి వచ్చిన ఇక్కడి పురుషులతో సెక్స్ చేసి.. గర్భం దాలుస్తారు. ఎందుకంటే.. ఇక్కడి ప్రజలే స్వచ్ఛమైన ఆర్యులని వారు నమ్ముతుంటారు.

brokpa pregnancy tourism కోసం చిత్ర ఫలితం


స్వచ్ఛమైన ఆర్యులకు జన్మనిచ్చే ఉద్దేశంతో మహిళలు విదేశాల నుంచి వస్తుంటారట. 2007లో సంజీవ్ శివన్ తీసిన ‘ది ఆచ్టంగ్ బేబీ... ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యూరిటీ’ అనే డాక్యుమెంటరీ ఇందుకు ఓ సాక్ష్యం. జర్మనీకి చెందిన ఓ మహిళ లద్దాఖ్ వచ్చి, ఇక్కడి వ్యక్తి సాయంతో గర్భం దాల్చినట్లు ఈ డాక్యుమెంటరీలో చెబుతారు. ఆర్యన్లు ఎత్తుగా, పొడుగ్గా ఉంటారు. వారే స్వచ్ఛమైన మనుషులని నమ్మే విదేశీయుల కారణంగా ఈ ప్రెగ్నెన్సీ టూరిజం విలసిల్లుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: