ఎన్నికల ముందు టీడీపీ పార్టీ నుంచి వలసలు అధికార పార్టీ ను కలవరపెడుతుంది. అయితే దీనికంతటికి కారణం చంద్ర బాబు అనుసరించిన వ్యూహమని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగారు.వీరేకాక.. సీనియర్ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ నేతలను చేర్చుకున్నారు. వారికే సర్వాధికారాలు ఇచ్చారు. ఇప్పుడు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారంతా మరోసారి తమకే సీట్లను కన్ఫం చేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరి చేతిలో ఓడిన టీడీపీ నేతలు తమకు టికెట్ దక్కదని తెలిసి వైసీపీ బాట పడుతున్నారు.

Image result for chandra babu

టికెట్లు దక్కవనే అభద్రతా భావం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీట్లు పోతాయనే భయంతో వారంతా మూకుమ్మడిగా టీడీపీని వీడి వైసీపీలోకి క్యూ కడుతున్నారు. వీరంతా బలమైన నేతలే కావడంతో వైసీపీ కూడా ఆహ్వానిస్తూ చేర్చుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సీట్ల గోల షేక్ చేస్తోంది. వలసవచ్చిన నేతలతో తమకు సీట్లు దక్కవని సొంత టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు. తాజాగా కర్నూలు సీటుపై పంచాయతీతో ఈ వివాదం బయటపడింది.

Image result for chandra babu

కర్నూలులో వైసీపీ తరుఫున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీలో చేరిపోయారు. ఇదే కర్నూలులో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎస్వీ మోహన్ రెడ్డి చేతిలో ఓడిన టీజీ వెంకటేశ్ తదనంతర కాలంలో టీడీపీ తరుఫున రాజ్యసభ ఎంపీగా వెళ్లిపోయారు. ఇప్పుడు ఎన్నికల వేళ కర్నూలు అసెంబ్లీ సీటు కోసం వీరిద్దరూ సిగపట్లు పట్టుకుంటున్నారు. టీజీ వెంకటేశ్ సీనియర్ నేత కావడం.. ఎస్వీ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఈ సీటును ఎవరికి ఇవ్వాలో తెలియక టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: