రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సహజం.. కాకపోతే ఎవరు ఏమి మాట్లాడినా అందులో లాజిక్ ఉండాలి.. వినేవాడు ఔను నిజమే కదా అనే పరిస్థితి ఉండాలి. ఇది వంటిబట్టించుకున్న కొందరు నేతలు ప్రత్యర్థులపై చక్కటి దాడి చేస్తూ పైచేయి సాధిస్తారు.



కానీ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమైందో కానీ.. తన ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. మినిమమ్ లాజిక్ మర్చిపోతున్నారు. తాజాగా ఆయన సర్వేలపై వైసీపీ విమర్శలను ప్రస్తావించారు. టీడీపీ సర్వేలు చేయించి వైసీపీ ఓట్లను తొలగిస్తుందన్నది వైసీపీ ఆరోపణ.



ఈ మేరకు జగన్ ఈసీని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు తాజాగా స్పందిస్తూ.. వైసీపీ వాళ్లే దొంగ ఓట్లు ముందే రాయించుకుని.. ఆ తర్వాత వాళ్లే ఫిర్యాదు చేస్తున్నారని విమర్శించారు. ఈ వాదన విన్నవారికి మతిపోవడం ఖాయం.



అంటే టీడీపీ పై బురద జల్లాలని వైసీపీ వాళ్లే వాళ్ల వాళ్ల ఓట్లు తొలగించుకుని మళ్లీ వాళ్లే ఫిర్యాదు చేస్తున్నారట. వారేవా.. వాట్ ఎ లాజిక్.. చంద్రబాబు ఈ స్థాయిలో ఎదురుదాడి ప్రారంభిస్తే..ఇక వైసీపీ నేతలు మాత్రం చేసేదేముంది. కానీ జనం అన్నీ గమనిస్తూనే ఉంటారు కదా.. చంద్రబాబు అన్నట్టే ప్రజలే తప్పుడు నేతలకు సమాధానం చెబుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: