పుల్వామా దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కడిని కాల్చి చంపేయాలని నాలుగేళ్ల బాలిక ప్రధాని మోదీని కోరింది. ఆమె లేఖ అంతర్జాలంలో వైరల్ అవు తోంది. పుల్వామా ఉగ్రదాడిలో 40మంది కన్నబిడ్డలను కోల్పోయి భరతమాత హృదయవేదనతో కంటతడి పెడుతోంది. ఉగ్రదేశం పాకిస్థాన్‌ పై యావత్ భారతం రగిలిపోతోంది. పాక్‌ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రతి భారతీయుడు డిమాండ్ చేస్తున్నారు. దాయాదిదేశం పాకిస్తాన్ను ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదని ఆసేతు శీతాచలం భారతావని మండిపడుతుంది అమర జవాన్లకు సంబంధించిన వివరాలు తెలుసు కుంటూ అందరూ బరువెక్కిన హృదయాలతో నివాళి అర్పిస్తున్నారు.

 

ఈ సందర్భంలోనే సూరత్‌ లో నాలుగో తరగతి చదువుతున్న ఒక బాలిక మరో అడుగు ముందుకు నడచి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. తద్వారా కొందరు రాజకీయనాయకుల ప్రమాదకర ఆలోచనా ధోరణిని విధానాన్ని మార్చుకోవాలని సందేశమిస్తున్నట్లే ఉంది 

 letter to modi by manali కోసం చిత్ర ఫలితం

పుల్వామా ముష్కరదాడి గుజరాత్‌ లోని సూరత్‌ జిల్లా పూనాకు చెందిన మనాలీ అనే  బాలిక  రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ దుర్మార్గ చర్య ఆ బాలికను సైతం తీవ్రంగా కలచివేసింది. పాకిస్థాన్‌ పై ప్రతీకారం తీర్చుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కరినీ నిలబెట్టి కాల్చి చంపాలని కోరింది.

 letter to modi by manali కోసం చిత్ర ఫలితం

మనాలి ప్రధానిని తన చిన్ని మనసుతో, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనూ చెప్పింద దేనని ఉటంకిస్తూ ఆయనలోని అంతఃకరణాన్ని తట్టి లేపుతూ సమారానికి సిద్ధమవమని చిన్ని కృష్ణునిలా ఉద్భోదిస్తున్నట్లుంది.    

 

దుర్మార్గులను చంపడం తప్పేమీ కాదని భవద్గీతలోనూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు మనాలి గుర్తుచేసింది. "మోదీ గారు, మీపై నమ్మకం ఉంది. మీరు ఏది చేసినా మంచే చేస్తారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కడిని కాల్చి చంపేయాలి. అలాంటి వాళ్లను చంపడం పాపం కాదు” అని గీతలో కూడా చెప్పారు.

letter to modi by manali కోసం చిత్ర ఫలితం 

మనాలి ఇంట్లో హోమ్‌వర్క్ చేస్తుండగా, టీవీలో పుల్వామా దాడికి సంబంధించిన వార్త చూసి చాలా బాధపడింది. ప్రధానితో మాట్లాడొచ్చా? అని వెంటనే తన తల్లిని అడిగింది. మాట్లాడటం కుదరదు కానీ, లేఖ రాయమని తల్లి సూచించారట. దీంతో ఆ బాలిక హిందీలో ఒక లేఖ రాసి ప్రధానికి పంపించింది.

 mamata comment on pulwama terror attack కోసం చిత్ర ఫలితం

"పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాక్ కే మద్దతిచ్చిన చంద్రబాబు" ఈ మద్య నాయకులకు దేశమాత రక్షణ కంటే తాము రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావటమే ప్రాధాన్యంగా కనిపిస్తుంది. వీళ్ళలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తొలి స్థానంలో ఉంటే దీదీ కొంగు  చాటు నుండి "అశ్వథామ హతః నరుడుకాదు కుంజరః" అనే తీరులో చంద్రబాబు రాజకీయాలు వల్లిస్తున్నారు. ఎందుకంటే ఘట్టిగా అంటే జనం రానున్న ఎన్నికల్లో ఎగిరి తంతారేమో? అనే భయం.  

Mamata Banerjee Raises Question on Timing of Pulwama Terror Attack, Asks Why This Happened Right Before Lok Sabha Elections 

Mamata Raises Question on Timing of Pulwama Attack, Asks Why This Happened Ahead of LS Polls? 

చంద్రబాబు నాయుడు ఉగ్రదాడి విషయంలో వివాదాస్పద వ్యాఖ్య చేసినట్లు కనిపిస్తోంది. ఈనాడు సమాచార స్రవంతిలో వచ్చిన ఒక వార్తను పరిశీలిస్తే చంద్రబాబు పాకిస్తాన్ వాదనను బుజాన వేసుకున్నట్లుగా కనిపిస్తుంది.

mamata comment on pulwama terror attack కోసం చిత్ర ఫలితం

"పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో రాజకీయలబ్ధి దాగి ఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని వ్యాఖ్యానించారు" అని ఈనాడులో ప్రచురితమైంది. అంటే దీనర్దం "భారత ప్రభుత్వం వాదనను కాదని, పాకిస్తాన్ ప్రధాని ఖండించిన వార్తను చంద్రబాబు నమ్ముతున్నారా?" ప్రధాని నరేంద్ర మోడీపై కోపం ఉంటే ఉండవచ్చు కాని, మరీ పాక్ వాదనకు మద్దతు ఇచ్చేలా మాట్లాడడం చంద్రబాబు అంతటి సుధీర్ఘ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవమున్న సీనియర్ మోష్ట్ రాజకీయవేత్తకు తగదేమో? ఆయన వయసు కైనా ఆ మాట సరికాదేమో! అంటున్నారు ప్రజలు.


చంద్రబాబు, మమత బెనెర్జీ వీరిరువురు మనాలి నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనేది సత్యదూరం కాదు. మీ రాజకీయాలు మీకు ఉండొచ్చు, కాని ఆ రొచ్చులోకి దేశాన్ని లాగొద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: