పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది. భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల బాంబులు వదిలాయి. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు జైషే మహమ్మద్ కు చెందిన శిబిరాలపై భారత్ వాయుసేన దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్‌ పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 Image result for pulwama attack

మంగళవారం అర్థరాత్రి... సరిగ్గా 2 గంటల 40 నిమిషాల సమయం. అప్పటికే సిద్ధంగా ఉన్న భారత మిరేజ్ యుద్ధ విమానాల పైలట్లకు టేకాఫ్ తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ అందింది. వెంటనే 12 విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు దూసుకెళ్లాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వందల కిలోల బరువున్న బాంబులను జారవిడిచాయి. ఈ దాడిలో పీఓకేలో ఉన్న అతిపెద్ద ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసం అయినట్టు ప్రాధమిక సమాచారం. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్  ప్రాంతాల్లోని జైషే మహ్మద్  ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది.

 

వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని అధికారులు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు జరిగాయని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన రెండు వారాలకు పాక్‌ ఉగ్రశిబిరాలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో భారత వైమానిక దళాలు ఈ దాడులకు దిగాయి. 2016లోనూ ఉరి పట్టణంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. 2016లో కూడా ఉరి పట్టణంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి అనంతరం మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్  చేశారు.

 

అయితే భారత్ దాడులను పాకిస్తాన్ తోసిపుచ్చింది. తమ భూభాగంలోకి ప్రవేశించాలనుకున్న భారత వాయు విమానాలను తమ ఆర్మీ తిప్పికొట్టడంతో వెనుదిరిగిందని వెల్లడించింది. నియంత్రణ రేఖను దాటి పాక్‌ పరిధిలోకి రావడానికి ప్రయత్నించిన విమానాలను తిప్పిపంపామని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి, మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్  ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌ లోని ముజఫరాబాద్ సెక్టార్‌ లో భారత వైమానిక దళానికి చెందిన జెట్  ఫైటర్లు ప్రవేశించాయని ఆసిఫ్ ఆరోపించారు.

Image result for india attack

వాస్తవానికి భారత్ దాడులు చేస్తుందనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. 40 మందికిపైగా జవాన్లను పొట్టనపెట్టుకున్న పాకిస్తానీ టెర్రరిస్టులకు తగిన బుద్ధి చెప్పేవరకూ భారత్ విశ్రమించదని సైన్యం చెప్తూ వస్తోంది. అదే సమయంలో భారత ప్రజలు కూడా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిందేనని కోరుకుంటున్నారు. తాజా దాడులతో కాస్త ఊరట లభించినట్టయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: