రాజకీయాల్లో ప్రతి మాటా చాలా ముఖ్యమే. వేసే ప్రతి అడుగు కూడా అతి ప్రధానమే. అటువంటిది ఏమీ చూసుకోకుండా కాపీ అండ్ పేస్ట్ అన్న తరహాలో కామెంట్స్ చేస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి మరి.


మమత మాటతో :


పశ్చిమ బంగ్లా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటలు పట్టుకుని ఈ మధ్యనే చంద్రబాబు మోడీని ఏకి పారేశారు. పుల్వామాలో వీర జవాన్లపై జరిగిన దాడి వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటూ గట్టిగా చెప్పుకొచ్చారు. ఏమో ఎవరికి తెలుసు గుజరాత్ లో గోద్రా మారణ హోమం వెనక వున్నవారే ఇక్కడా అంటూ మోడీ పై లేని పోని అనుమానాలు కలుగచేసేలా మాట్లాడారు.  పూల్వామా దాడులు పాకిస్థాన్ పని కాదని అక్కడ ప్రధాని చెబుతున్నారంటూ కూడా బాబు వత్తాసు పలికారు. 


దాని మీద సోషల్ మీడియాలో ఓ రేంజిలో సెటైర్లు పడ్డాయనుకోండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రా పర్యటనలో సైతం బాబు కామెంట్స్ పై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని మీదనే బాబుకు నమ్మకం అంటూ సెటైర్లు కూడా వేశారు. 


సీన్ కట్ చేస్తే :


ఇక ఇపుడు చూస్తే పాకిస్థాన్ మీద భారత్ వాయుసేన వీర విజ్రుంభణ చేసింది. ఏకంగా బోర్డర్ దాటి వెళ్ళి మరీ జైషే మహ్మద్ ఉత్ర శిబిరాలను నేలమట్టం చేసేసింది. దేశం మొత్తం మన జవాన్లను కీర్తిస్తున్నారు. అందరితో పాటుగానే చంద్రబాబు కూడా వీర జవన్ల సాహసాన్ని కొనియాడుతున్నారు. ఎన్నడూ లేనిది ఆయన నోటి వెంట ముత్యాలు లాంటి పదాలు కూడా దొర్లాయి. భారత వైమానిక దళం సేవలు నిరుపమానమని, వాటిని రాజకీయ కోణంలో చూడవద్దంటూ బాబు ఇపుడు సుద్దులు చెబుతున్నారు. 


మరి నాడు బాబు అన్న మాటలేంటని సోషల్ మీడియా కూడా ఎకసెక్కెం ఆడుతోంది. నిన్న గాక మొన్న నీవన్న మాటలేంది బాబూ అంటూ విసుర్లు విసురుతోంది.  అంటే సమాయనుకూలంగా ఎలా పడితే అలా అనేయడం. తరువాత మాట మార్చేయడం. అయినా జనం నమ్ముతారా బాబూ, అన్నీ రాజకీయ కోణంలో నుంచి చూసేది మీరే కదా అంటూ కౌంటర్లు పడుతున్నాయి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: