పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టెర్రరిస్టు గ్రూపులను ఏరివేసే దిశగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని భూభాగాలపై ఇండియన్ ఆర్మీ ఈ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది టెర్రరిస్టులు చనిపోయినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం కూడా ఈ వాతావరణం కంటిన్యూ అయింది. సరిహద్దులో పలు చోట్ల రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడ్డాయి.

Image result for pilot abhinandan

          భారత భూభాగంలోకి వచ్చిన ఓ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చివేసింది. ఈ క్రమంలో భారత్ కు చెందిన మిగ్ – 21 విమానం ఒకటి కూలిపోయింది. ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్ అభినందన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే దురదృష్టవశాత్తూ అతణ్ణి పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతేకాక భారత్ కు చెందిన మిగ్ 21 విమానం తమ భూభాగంలోకి రావడంతో తామే దాన్ని కూల్చివేశామని తెలిపింది. ఒక పైలట్ చనిపోయాడని, మరో పైలట్ గాయపడ్డారని ప్రకటించింది.

Image result for pilot abhinandan

పాక్ మీడియాలో ఇలాంటి కథనాలు రాగానే భారత్ అలాంటిదేమీ లేదని మొదట ఖండించింది. అయితే ఆ తర్వాత పైలట్ ఆచూకీ కనిపించడం లేదంటూ వెల్లండించింది. మిగ్ 21 పైలట్ అభినందన్ ను పాక్ అదుపులోకీ తీసుకున్నట్టు తమ దృష్టికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖాధికారులు వెల్లడించారు. దీంతో పాక్ చెప్పింది నిజమేనని నమ్మాల్సి వచ్చింది. ప్రస్తుతం పైలట్ అభినందన్ పాకిస్తాన్ అధీనంలో ఉన్నారు. అంతేకాక అభినందన్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా పాక్ విడుదల చేసింది. తన పేరు అభినందన్ అని, తాను భారత వాయుసేనలో పని చేస్తున్నానని వెల్లడిస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.

Image result for pilot abhinandan

అంతకుముందు భారత్ కు చెందిన రెండు విమానాలను తాము కూల్చివేసినట్లు పాక్ అధికారి ఆసిఫ్ ఘఫూర్ మీడియాకు వివరించాడు. తమ భూభాగంలోకి రావడంతో ఒకదాన్ని వాస్తవాధీన రేఖ వద్ద, మరోదాన్ని కాశ్మీర్ భూభాగంలో కూల్చివేసినట్టు ప్రకటించాడు. ఇదే వాతావరణం రోజంతా కొనసాగింది. చివరకు ఆచూకీలేకుండా పోయిన అభినందన్ పైలట్ పాకిస్తాన్ స్వాధీనంలో ఉన్నట్టు భారత్ ప్రకటించింది. దీంతో భారత్ లో నిరాశ అలుముకుంది. పైలట్ అభినందన్ ను చిత్రహింసలకు గురిచేసి అదుపులోకి తీసుకున్నట్టు వీడియోలో స్పష్టమవుతోంది. అతడి తలపై బాగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమవుతోంది. ఈ దృశ్యాలు భారతీయుల హృదయాలను గాయపరుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: