పాక్ తన ఆగ్రహాన్ని భారత్ పై వ్యక్తం చేయటానికి సైన్యాన్ని వినియోగించాలి. దానికి సాధారనంగా జాతి సంపద వెచ్చించాల్సి వస్తుంది. కాని ఆ పని సైన్యం ఉగ్రవాదు లతో చేయిస్తూ, ప్రపంచ చట్టాల ముంది తాను బహిరంగంగా దోషిగా నిలవకుండా ఆ నేర నెపాన్ని ఉగ్రవాదులపైకి నెట్టేసి తాను చోధ్యంచూస్తుంది. అంతేకాదు పాక్ ప్రభుత్వాలు తొలి నుంచి సైన్యం చేతిలో కీలు బొమ్మలే. నిజంగా చెప్పాలంటే ఉగ్రవాదమే పాక్ సైన్యానికి పరోక్షంగా ప్రాణంగా మారింది.   

jaish e mohammed taliban e jhang terror groups కోసం చిత్ర ఫలితం

పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతో తన కార్యకలాపాలు సాగిస్తోన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ గత కొంతకాలంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించటానికి, ఉగ్రవాద సరపరా, ఉగ్రవాద కార్యకలాపాల అమలు, నిర్వహణ, వ్యాప్తికి నిధులను స్వంతంగానే సమకూర్చుకోవటం కోసం కొత్త శాశ్విత పంధాను అనుసరిస్తుంది. భారత్ లోకి ఉగ్రవాదులను ఎగుమతి చేయడం భారత్ లోనే కార్యకలాపాల విస్తృతి పెంచుతూ ఇక్కడి యువతను ఉగ్రవాదంవైపు మళ్లించి భారత్ ను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ సంస్థ పలువ్యాపారాల ద్వారా నిధులను సమకూర్చుకుంటూ ఉందని భారత్, అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. 
jaish e mohammed taliban e jhang terror groups కోసం చిత్ర ఫలితం

ఈ సంస్థ 2007 నుంచి రియల్ ఎస్టేట్, నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, పంపిణీ, వస్తు వాణిజ్యం, ఇతర అసాంఘిక కార్యకలాపాలతో కూడిన వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు భారత్, అమెరికా నిఘా వర్గాల పరిశీలనలో వెల్లడయ్యింది. అమెరికా నిఘా వర్గాల ప్రకారం, ప్రభుత్వజప్తు నుంచి తప్పించుకోడానికి జేష్-ఏ-మహ్మద్ సంస్థ బ్యాంకుల్లో నగదు నిల్వలను నిర్వహించట్లేదని అలాగే బాంకింగ్ రంగాన్ని అంతగా వినియోగించుకోకుండా ఇతర వ్యాపా మార్గాలను అనుసరిస్తుందని తెలుస్తుంది.  
pak army with terrorist leaders కోసం చిత్ర ఫలితం
తమచేతికి మట్టంటకుండా జైష్-ఏ-మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల ద్వారా పనిచేయిస్తూ ఉండటంతో వారు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని నిఘా విభాగానికి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు, మతపరమైన కార్యక్రమాల పేరుతో పెద్ద మొత్తంలో విరాళాలు, చందాల ద్వారా నిధులను సేకరించి, వాటిని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులకు వినియోగిస్తున్నట్టు భారత అధికార వర్గాలు తెలియజేశాయి. బాంకింగ్ కు ఆల్టర్నేటివ్ గా అల్ రహ్మత్ ట్రస్ట్, అల్ రషీద్ ట్రస్ట్‌ల ద్వారా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నిధులను సమకూర్చుకుంటోందని తెలిపాయి. 
pak army with terrorist leaders కోసం చిత్ర ఫలితం
నిఘా వర్గాలు, అంతర్జాతీయ నివేదికలు ప్రకారం, పాక్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చట్టంలో లొసుగులు, పెరుగుతోన్న నిరుద్యోగాన్ని జైష్-ఏ-మహ్మద్ తనకు అనుకూలం గా మలచు కుని బలాన్ని పెంచుకుంటోంది. ఈ సంస్థలో 1000 మందికి పైగా శిక్షణ పొందిన ఉగ్రవాదులతోపాటు వివిధ మదర్సాల్లో వేలాది మందిని బాల్యం నుండే ఉగ్ర వాదం లోకి మరల్చు కుంటోంది. ఇలాంటి రిక్రూట్‌మెంట్స్ పాక్ వ్యాప్తంగా కొనసాగుతుండగా, ముఖ్యంగా దక్షిణ పంజాబ్‌ లో విస్తరణపై జైష్-ఏ-మహ్మద్ దృష్టిసారించింది. తనతోపాటు లష్కరే ఇ ఝంగ్వీ, లష్కరే ఇ తైబా, అల్‌-ఖైదా, తాలిబాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు సైతం స్వేచ్ఛగా కర్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొంది. 
pak army with terrorist leaders కోసం చిత్ర ఫలితం
దక్షిణ పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని రాజన్‌ పూర్, సింధ్‌ లోని కష్మోరే, బలూచిస్థాన్‌ లోని డేరా, బుగ్టీ జిల్లాలు నేరస్థులు, జీహాదీ గ్రూపులకు నిలయాలుగా మారయని బ్రస్సెల్‌ కు చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ తెలియ జేసింది. అలాగే సింధునదిలో ఉన్న మూడు చిన్న ద్వీపాలను జైషే మహ్మద్ సహా పలు తీవ్రవాద సంస్థలు ఆక్రమించుకున్నాయి. 
madarsa in pak & POk కోసం చిత్ర ఫలితం

JeM terrorists trained in Pakistan's Balakot used to take four routes through PoK to enter Jammu and Kashmir 

ఈ ప్రాంతంలో ప్రభుత్వ చట్టాలు అమలు సక్రమంగా లేకపోవడంతో ఉగ్రవాదులకు అనుకూలంగా మారాయి. ఇక, బలూచీస్థాన్ సరిహద్దు ల్లోని రాజన్‌ పూర్, డేరా ఘాజీ ఖాన్ జిల్లాల్లోని జీహాదీ మదర్సాల్లో కొన్నింటికి ఇస్లామాబాద్‌లోని లాల్ మసీద్‌తో అనేక సంవత్సరాలుగా ప్రత్యక్షసంబంధాలు ఉన్నాయని పలునివేదికలు వెల్లడించాయి.

al rahmat trust & al rashid trust కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: