ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా భారత వాయుసేన(ఐఏఎఫ్) అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అభినందన్ ను చూడగానే అక్కడ భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు భారత్ మాతాకీ జై, హిందుస్థాన్ జిందాబాద్ అని భారీ ఎత్తున నినాదాలు చేశారు. భారత్‌లో అడుగుపెట్టిన అనంతరం అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
వాఘా సరిహద్దుకు చేరుకున్న అభినందన్‌
వాఘా సరిహద్దు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అభినందన్‌కు స‍్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుంటున్నారు.  ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ అధికారులు చట్టపరమైన అప్పగింత ప్రక్రియలో పాల్గొంటున్నారు. వైద్య పరీక్షలన్నీ పూర్తిచేశాక అభినందన్ ఆరోగ్యంగా ఉన్నాడని తేలితే ఆయన్ను ఢిల్లీకి తీసుకెళతారని విశ్వసనీయవర్గాలు తెలిపారు. 

పుల్వామా దాడి తర్వాత భారత్- పాక్ ల మద్య యుద్ద మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నిన్నభారత భూభాగంలోకి చొరబడ్డ పాక్ యుద్ధవిమానాలను వెంబడించిన అభినందన్ అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చేశారు. ఈ సందర్భంగా తన మిగ్-21 బైసన్ విమానం దెబ్బతినడంతో పాక్ భూభాగంలో పారాచూట్ ద్వారా దిగారు.  దీంతో పాక్ సైన్యం ఆయన్ను అరెస్ట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: