మంత్రి నారా లోకేష్‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు కుమారుడుగానే కాకుండా త‌న ప‌నిత‌నంతో దూసుకుపోయిన నాయ‌కుడు కూడా ఆయ‌న గుర్తింపు సాదించారు. ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విజ‌యవంత‌మైన ప్రాజెక్టుల‌ను రాష్ట్రానికి తీ సుకు వ‌చ్చారు. అన‌తి కాలంలోనే ఐటీ రాజ‌ధానిగా ఏపీని అభివృద్ధి చేసేందుకు మంత్రిగా లోకేష్ కృషిని ప్ర‌పంచ దేశా లు సైతం కొనియాడిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇక‌, ఏపీతో విభేదించే కేంద్రం కూడా ఐటీ స‌హా గ్రామీణ అభివృద్ది విష‌యంలో మంత్రి లోకేష్ దూకుడును ప‌లు వేదిక‌ల‌పై మెచ్చుకుంది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌నపై సోష‌ల్ మీడియా లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.


2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం టీడీపీ ప్ర‌చారానికి, పార్టీని గెలిపించుకునేందుకు మాత్ర‌మే నారా లోకేష్ ప‌రిమిత‌మ య్యారు. డిజిట‌ల్ మాధ్య‌మాల్లో భారీ ఎత్తున టీడీపీ ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించారు. దీంతో పార్టీ అధికారంలోకి కూడా వ‌చ్చింది. ఇక‌, ఆ త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాలకే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే, ప్ర‌భుత్వంలో లోకేష్ ఉంటే బాగుంటుంద‌నే సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు చంద్ర‌బాబు..అప్ప‌ట్లోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేసి.. అనంత‌రం 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో లోకేష్‌ను మంత్రిగా ప్ర‌మోట్ చేశారు. ఈ క్ర‌మంలోనే అత్యంత కీల‌క‌మైన ఐటీ, గ్రామీణాభివృద్ది శాఖ‌ల‌ను ఆయ‌న కు అప్ప‌గించారు. 


అయితే, ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ స‌హా జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన తీరుపై తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టారు.దొడ్డిదారిలో మంత్రి అయ్యారంటూ.. లోకేష్‌పై నిప్పులు చెరిగారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తీవ్రంగా మ‌ధ‌న ప‌డిన చంద్ర‌బాబు ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి దింపి.. ఆయ‌న‌ను కూడా అసెంబ్లీకిపోటీ చేయించి.. అనంత‌రం మంత్రిగా ప్ర‌మోష‌న్ ఇచ్చుకోవాల‌ని నిర్ణ‌యించారు. దీంతో రాష్ట్రంలోని ఏ నియోజ‌క‌వ‌ర్గం అయితే.. లోకేష్‌కు బాగుంటుంద‌నే ప్రచారం కూడా సాగింది. అయితే, ఎన్నిక‌ల‌కు స‌మయం ముందుకు వ‌స్తున్నా.. ఇప్ప‌టికే ఎమ్మెల్సీలుగా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, మంత్రి నారాయ‌ణ‌లు రాజీనామా చేసినా లోకేష్ మాత్రం చేయ‌లేదు.


మంత్రులు సోమిరెడ్డి, నారాయ‌ణ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలోని స‌ర్వేప‌ల్లి నుంచి ఒక‌రు, నెల్లూరు సిటీ నుంచి ఒక‌రు పోటీ చేస్తున్నారు. మ‌రి లోకేష్ ప‌రిస్తితి ఏంటి?  లోకేష్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇక‌, సోమిరెడ్డి, నారాయ‌ణ‌లు ఇప్ప‌టికే రాజీనామాలు చేసినా.. లోకేష్ రాజీనామా చేయ‌క‌పోవ‌డంపై కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. లోకేష్ ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి అసలు దిగుతారా?  లేక ఎమ్మెల్సీగానే ఉండిపోతారా? అనే చ‌ర్చ సాగుతోంది. మ‌రి దీనికి స‌మాధానం రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: