ఎన్నిక‌లకు స‌మ‌యం స‌మీపించింది. మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో అన్ని పార్టీ లూ గెలుపు గుర్రాల‌కే అవ‌కాశం ఇస్తున్నాయి. ఇక‌, ఏళ్ల‌త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో ఉన్న కొన్ని ఫ్యామిలీలు కూడా ఇప్పుడు ఎన్నిక ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నాయి. వీరిలో ప్ర‌ధానంగా క‌ర్నూలు నుంచి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి ఫ్యామిలీ రంగంలోకి దిగుతోంది. క‌ర‌డు గ‌ట్టి కాంగ్రెస్ వాదులే అయినా ఎన్నిక‌ల రాజ‌కీయాల నేప‌థ్యం ఈ కుటుంబం ఇటీవ‌లే ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి చేరిపోయింది. పార్టీలో చేరే ముందుగానే అన్ని ప్యాకేజీలు స‌ర్దుబాటు చేసుకుని చాలా జాగ్ర‌త్త ప‌డ‌డం గ‌మ‌నార్హం. క‌ర్నూ లు ఎంపీ టికెట్‌ను కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి, ఆలూరు అసెంబ్లీ టికెట్‌ను కోట్ల సుజాత‌మ్మ‌కు కేటాయించ‌డం దాదాపు ఖ‌రారైన‌ట్టే.


ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఫ్యామిలీ గెలుపు ఎలా ఉంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది. అధికార పార్టీని ఎదు ర్కొనేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా భారీ ఎత్తున పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వైసీపీ కూడా కోట్ల‌పై స‌రైన వారిని బ‌రిలోకి దింపింది. క‌ర్నూలు ఎంపీ స్థానంలో బీసీ వ‌ర్గానికి చెందిన రంగ‌య్య‌ను వైసీపీ పోటీకి దింపుతున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి సంస్థాగ‌తంగా వైసీపీ బ‌లంగానే ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా చూసుకుంటే. రంగయ్య ఆశించిన మేర‌కు బ‌ల‌మైన నాయ‌కుడు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఆలూరు నుంచి మ‌రో బీసీ నేత జ‌య‌రాంను కోట్ల సుజాత మ్మపై పోటీకి పెట్టేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. 


ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల‌ను ఒక్క‌సారి చూసుకుంటే కోట్ల ఫ్యామిలీకి మంచి ప‌లుకుబ‌డి, ప్ర‌జ‌ల్లో ఫాలోయింగ్ ఉండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసిన కోట్ల అంత వ్య‌తిరేక‌త‌లోనూ ల‌క్షా యాభైవేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇక ఆలూరులో పోటీ చేసిన సుజాత‌మ్మ సైతం 25 వేల ఓట్లు సాధించి కాంగ్రెస్ త‌ర‌పున డిపాజిట్ తెచ్చుకున్న అతి కొద్దిమందిలో ఒక‌రుగా నిలిచారు. ఇక‌, ఇప్పుడు టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు పెరుగుతుండడంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, ఆలూరు నుంచి సుజాత‌మ్మ గెలుపు కూడా ఈజీనేన‌ని చెబుతున్నారు.  వాస్త‌వంగా చూస్తే క‌ర్నూలు జిల్లాలో వైసీపీ బ‌లంగా ఉంది. అయితే క‌ర్నూలు ఎంపీ సీటుతో పాటు, ఇటు ఆలూరులో కోట్ల ఫ్యామిలీపై బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించితేనే వారి దూకుడుకు అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని లేకుండా కోట్ల ఫ్యామిలీకే ఎడ్జ్ ఉంటుంద‌న్న రాజ‌కీయ చ‌ర్చ‌లు జిల్లాలో న‌డుస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: