ఐటి గ్రిడ్స్ కంపెనీ ఛైర్మన్ అశోక్ పై తెలంగాణా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మామూలుగా అయితే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయటమంటే చాలా పెద్ద నేరాల్లో ఇరుక్కున వారి విషయంలో మాత్రమే జారీ చేస్తారు. అలాంటిది అశోక్ విషయంలో కూడా నోటీసు జారీ  చేశారంటేనే  ఈ కేసు తీవ్రత ఎంతో  తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోను సంచలనం రేకెత్తిస్తున్న 3.5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాల డేటా చోరీ స్కాం లో అశోక్ కీలక వ్యక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే.


తమ సానుభూతిపరుల ఓట్లను టిడిపి లక్షల్లో తొలగిస్తోందంటూ వైసిపి నేతలు దాదాపు ఏదిగా మొత్తుకుంటున్నారు. అయినా వారి గోడు ఎవరు వినిపించుకోలేదు. మొత్తానికి వైసిపి ఓట్లను ఏరేయటానికి టిడిపి అనుసరిస్తున్న విధానం ఇప్పుడు బయటపడింది. ఎప్పుడైతే విషయంవెలుగుచూసిందో అప్పటి నుండి చంద్రబాబునాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డి మీదే ఎదురుదాడి చేస్తున్నారు. వైసిపినే తమ ఓట్లను తొలగించేస్తోందంటూ ఎదురు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.


సరే ఆ విషయాలను పక్కనపెడితే డేటా చోరీలో కీలక వ్యక్తి అశోక్ విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసును లెక్క చేయలేదు. దాంతో నాలుగు బృందాలను పెట్టి వెతుకుతున్న అశోక్ జాడను పోలీసులు కనిపెట్టలేకపోయారు. అమరావతి పరిధిలోని ఉండవల్లిలోనే ముఖ్యనేతల షెల్టర్లోనే అశోక్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విదేశాలకు పారిపోకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు అశోక్ పై లుక్ అవుట్ నోటీసును జారీ చేశారు. దాంతో ఈరోజు కాకపోయినా రేపైనా అశోక్ పోలీసుల ముందు హాజరుకాక తప్పని పరిస్ధితులు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: