గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డేటా చౌర్యం కేసుకు సంబంధించిన కొట్లాట మామూలుగా లేదు.  భారత్-పాక్ కి మద్య జరిగిన యుద్దంలా తెలంగాణ-ఏపికి జరిగినట్టు అనిపిస్తుంది.   డేటా చోరీ కేసు విషయంలో తెలంగాణ సిట్ ఏర్పాటు చేయడం..మా పరిమిషన్ లేకుండా మా డేటా ఎట్ల బయటకు తీస్తారని ఏపి టీడీపీ నాయకుడు గగ్గోలు పెట్టడం ఇలా ప్రతిరోజూ ఓ సెన్సేషన్ న్యూస్ గా మారుతుంది. 
Image result for election commission of india
తాజాగా డేటా చోరీ కేసు ఢిల్లీ వరకు చేరింది.  ఇరు పక్షాలు తప్పు మీదంటే..తప్పు మీదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.   వైసీపీ తప్పుడు దరఖాస్తులపై ఈసికి టీడీపీ ఫిర్యాదు.  ఈ ఆపరేషన్ తెలంగాణలో మొదలైందని..తెలంగాణ పోలీసులకు సంబంధం లేకున్నా ఏపి ప్రభుత్వం వ్యహహారాల్లో జోక్యం చేసుకుంటుంన్నారని టీడీపీ ఆరోపిస్తుంది.

ఓట్ల తొలగింపు, ఫారం 7, డేటా చోరీపై  సీఈసీకి టీడీపీ ఫిర్యాదు. తమ ఫిర్యాదు స్వీకరించిన ఈసీ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లను తొలగించాలని వైసీపీ దరఖాస్తు పెట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఆ దరఖాస్తులన్నీ వొట్టి బూటకమని తేలిందని వారు అంటున్నారు.  వైసీపీ తప్పుడు దరఖాస్తులపై ఈసీకి ఫిర్యాదు చేశామని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: