ఏపీలో టీఆర్‌ఎస్‌ పోటీ చేయబోతోందా.. విజయవాడ నుంచి పోటీ చేయబోతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. విజయవాడకు చెందిన ఓ టీఆర్‌ఎస్‌ అభిమాని విజయవాడలో పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నాడు. కేసీఆర్ ఓకే అంటే చాలు కారు గుర్తుపై బెజవాడలో పోటీ చేస్తానంటున్నాడు. 

సంబంధిత చిత్రం

టీఆర్ఎస్ టికెట్‌పై విజయవాడ నుంచి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి కూడా చెప్పానన్నారు. 

trs in vijayawada కోసం చిత్ర ఫలితం

తెలంగాణ ఎంపీ అభ్యర్థులతోపాటే తాను కూడా బీఫారం తీసుకుంటానని ఆది నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. ఆదినారాయణ ప్రచారానికి కేసీఆర్‌ను తీసుకొస్తానంటున్నారు. మరి ఇందుకు కేసీఆర్ ఒప్పుకుంటారోలేదో చూడాలి. 

vijayawada land mark కోసం చిత్ర ఫలితం

ఇంతకీ ఈ ఆదినారాయణ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే.. ఆదినారాయణది విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌. కేసీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలని కనకదుర్గమ్మను మొక్కుకున్నారు. గెలిచాక 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు కూడా. అంతేనా.. మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కి అమ్మవారిని దర్శించుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: