క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు  చూస్తుంటే తెలుగుదేశంపార్టీలో దాదాపు 30 మంది ఎంఎల్ఏలకు టికెట్లలో కోత తప్పేట్లు లేదు. వీరిలో సుమారు 16 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలే ఉండటం గమనార్హం. ఎప్పుడైతే చంద్రబాబునాయుడు తమకు టికెట్లు నిరాకరిస్తున్నారని, ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని అర్ధమైపోయిందో వెంటనే అమరావతిలో బలప్రదర్శనకు దిగేశారు.  దాంతో ఆశావహులు, టికెట్లలో కోతపడే వాళ్ళతో చంద్రబాబు క్యాంపు కార్యాలయం దగ్గర గందరగోళం మొదలైంది.

 

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు. వారందిరికీ అప్పట్లో టికెట్లు ఇస్తానని హామీనిచ్చే పార్టీలోకి లాక్కున్నారు చంద్రబాబు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి సర్వేల్లో ఫీడ్ బ్యాక్ సరిగా లేదని చెప్పి సుమారుగా 16 మందికి టికెట్లు ఇవ్వటంలేదని చెప్పేస్తున్నారు. దాంతో వారంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరే చేసుకున్నవారికి చేసుకున్నంత అని పెద్దలు ఊరికే అనలేదు కదా.

 

ఇక టిడిపిలో సిట్టింగుల పరిస్ధితి వేరేగా ఉంది. సిట్టింగులంతా బాగా అవినీతి, అక్రమాలతో నియోజకవర్గాల్లో గబ్బుపట్టిపోయాంటూ నేతలే మండిపడుతున్నారు. వారికి తిరిగి టికెట్లిస్తే ఓటమి ఖాయమని నేరుగా చంద్రబాబుతోనే చెబుతున్నారు. అటువంటి వారిలో కొవ్వూరులో మంత్రి జవహర్, పాయకరావుపేటలో వంగలపూడి అనిత, విజయనగరం అర్బన్ నుండి మీసాల గీత, పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులు, అమలాపురంలో అయినాబత్తుల ఆనందరావు, నిడదవోలు బూరుగుపల్లి శేషారావు, గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు, చింతలపూడిలో పీతల సుజాత, తాడికొండలో శ్రవణకుమార్, పోలవరంలో మొడియం శ్రీనివాసరావు తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: