కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇటీవల కలకత్తా నగరంలో మోడీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి దేశంలో ఉన్న ప్రముఖ జాతీయ నాయకులు అందరినీ ఏకం చేసి దేశం మొత్తం చూపు తనవైపు ఉండేలా చూసుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఈ క్రమంలో త్వరలో పార్లమెంటు ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Image result for mamata banerjee

మమతా బెనర్జీ తన పార్టీ తరఫున 41 శాతం మంది మహిళలకు లోక్ సభ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా నందమూరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువగా మహిళలే పోటీ చేయబోతున్నట్లు ..ఈ క్రమంలో మహిళల గురించి మాట్లాడే పార్టీలకు సవాలు విసురుతూ అత్యధిక సీట్లు మహిళలకు కేటాయిస్తున్నాను...మహిళల రిజర్వేషన్ ల గురించి మాట్లాడే పార్టీలు ఏమి చేస్తాయో చూడాలని ఆమె అన్నారు.

Related image

ముగ్గురు బెంగాలి నటీమణులకు కూడా టిక్కెట్లు ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు.నుస్రత్‌ జహాన్‌, మిమీ చక్రబర్తి, మున్‌ మున్‌ సేన్‌లకు టికెట్‌ ఖరారు చేసినట్లు ఆమె ప్రకటించారు.అసనోల్‌ నియోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోకు పోటీగా మున్‌ మున్‌ సేన్‌ బరిలోకి దిగుతారని మమత పేర్కొన్నారు.

Related image

అదే విధంగా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఎంసీలో చేరిన మౌసమ్‌ నూర్‌ మల్దా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ఇటీవల దారుణంగా హత్యకు గురైన టీఎంసీ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిస్వాస్‌ భార్య రుపాలీ బిస్వాస్ కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతారని మమత పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: