హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని జగన్ నివాసం ఫుల్ బిజీగా ఉంటోంది. చేరికలతో హడావిడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేకు కూడా తన ఇంట్లోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 

jagan house puthalapattu mla కోసం చిత్ర ఫలితం


పూతలపట్టు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సునీల్ కొనసాగుతున్నారు.  ఈసారి ఆయనకు సీటు దక్కకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం జగన్ నివాసమైన లోటస్‌ పాండ్‌కు వెళ్లారు.
jagan house puthalapattu mla కోసం చిత్ర ఫలితం


 దాదాపు నాలుగు గంటలపాటు జగన్ నివాసం వద్దే ఉన్నా ఆయనను లోపలికి అనుమతించలేదు పైగా.. అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ నివాసం వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సునీల్ ఎదురుపడినప్పటికీ రామచంద్రారెడ్డి ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయినట్టు తెలిసింది.

jagan house puthalapattu mla కోసం చిత్ర ఫలితం

తనకు రాజకీయ భిక్ష పెట్టిన రామచంద్రారెడ్డి కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సెల్ఫీ వీడియో లో మాట్లాడుతూ తను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నప్ప టికి ప్రతిపక్షం కావటం తో తన ప్రజలకి ఏమి చేయలేకపోయామని కన్నీరు పెట్టుకున్నారు. ఇక తనకి టికెట్ వస్తుందో రాదో అన్న సందేహం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: