ఎన్నికల్లో పోటీ చేస్తే  గెలవడం ఓడడం అన్నది ఉంటుంది. మరి ఎక్కడా పోటీయే చేయకుండా లోకెష్ ఓడడం ఏంటి. అదే తమాషా మరి. లోకెష్ నాయుడు ఇప్పటి వరకూ ఎక్కడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎరగరు. కానీ ఈసారి ఎందుకో చినబాబు గారు బాగా ముచ్చట పడ్డారు. ఎంత ముచ్చట అంటే తమ పార్టీ తమ్ముళ్ళకే ముచ్చెమటలు పట్టించేటంతగా.  అంతన్నారు, ఇంతన్నారు. హడావుడి చేశారు. మొత్తానికి ఇపుడు చినబాబు విశాఖకు తూచ్ అనేశారు.


మంగళగిరి నుంచి లోకేష్ బాబు పోటీ అని ఇప్పటికిది లేటెస్ట్ న్యూస్. అయితే  అక్కడ కూడా డౌటేనేమో అని సెటైర్లు పడుతున్నాయి మరో వైపు. ఇక, లోకేష్ బాబు భీమిలీ నుంచి పోటీ అంటూ గడచిన నాలుగు రోజులుగా సాగర తీరంలో రేపిన రాజకీయ తుపాను అంతా ఇంతా కాదు. మొత్తానికి మొత్తం సీట్ల కధ అంతా గందరగోళంలో పడేశారు. మంత్రి గారికే సీటు లేదా అన్నంతగా ప్రచారం సాగింది. మరో వైపు లోకెష్ భీమిలీ అంటే ఓడిపోతారని న్యూస్ రావడంతో హడావుడిగా ఉత్తరం సీటు అన్నారు. అక్కడా డౌటే అనడంతో ఏకంగా విశాఖ నుంచి బైబై అంటున్నారు.


నిజానికి ఇపుడు చూస్తే లోకెష్ పోటీ అంటూఅ జరిగిన ప్రచారం మొత్తం  విశాఖ టీడీపీని కంపు కొట్టించిందనే చెప్పాలి. ఆ పార్టీలో బాబు తరువాత భావి నాయకుడు అనదగ్గ లోకేష్ వేసిన ఉత్తర కుమార వేషాలతో ఇక్కడ టీడీపీ అసలు బలం ఎంటో, చినబాబు అసలు సరుకు ఏంటో కూడా లోకానికి బాగా  తెలిసిపోయింది. ఓ విధంగా చెప్పాలంటే  లోకేష్ పోటీ చేయకుండానే ఓడిపోయారు. విశాఖను వీడిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: