కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వైయస్ కుటుంబీకుల కంచుకోట అని తెలిసిన విషయమే. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం నుండి పోటీచేసి మళ్లీ గెలుపొందడం ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో లో ఒక్కసారి కూడా టీడీపీ తమ జెండాను ఎగుర వేయలేకపోయింది. కానీ టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి  ఈ సారి గెలవాలని ప్రతిపక్ష నేతగా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే విషయం వాస్తవం. దీనివలన కొంతమేరకు జగన్మోహన్ రెడ్డికి రావలసిన మెజారిటీ తగ్గుతుందని విశ్లేషకుల అభిప్రాయం. పులివెందుల లో వైయస్ కుటుంబానికి పోటీగా నిలవడానికి ఎంతటి మహా నేతలు వచ్చిన నిలువ లేరన్నది అందరి నోటిలో నానెే మాటే. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఈ ప్రాంతంలో గెలవాలని కోవడం చాలా కష్టతరమైన  విషయం. టిడిపి అభ్యర్థి సతీష్ రెడ్డి మాత్రం తనవంతు కృషి చేస్తూ ప్రజల్లో లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ గెలుపొందాలని ఆకాంక్షతో ముందుకెళుతున్నారు. ఈసారి ప్రజలు ఎం నిర్ణయిస్తారు చూడాలి మరి. చాలా వరకు ఇక్కడి పోరు ఏకపక్షంగానే సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ నియోజకవర్గం పై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. మొత్తానికి ఇక్కడి విజయం వైయస్ జగన్మోహన్ రెడ్డిదేనని అందరి అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: