గుంటూరు జిల్లా ఇది.. తెలుగుదేశం ఎక్కువగా ఆశలు పెట్టుకున్న జిల్లా. ఇక్కడి నుంచే యువ నేత లోకేశ్ ను కూడా బరిలో దింపుతున్నారు. మరి గుంటూరు జిల్లా గ్రౌండ్ రిపోర్ట్ ఓ సారి చూద్దాం.. లోకేశ్ సంగతి తేలినా.. కీలకమైన రాజధాని పరిధిలో గుంటూరు జిల్లా కేంద్రంలో అభ్యర్థులు ఎవరో ఇంకా తేలలేదు. 

సంబంధిత చిత్రం


గుంటూరు నగరంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గతంలో వైసీపీ అభ్యర్థి ముస్తపా విజయం సాధించారు.  గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మద్దాలి గిరి పోటీ చేసి స్వల్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా గిరి టికెట్ ఆశిస్తున్నారు. 

guntur district politics కోసం చిత్ర ఫలితం

తూర్పు నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ. అందుకే అక్కడ మైనార్టీ అభ్యర్థి అయితే బాగుంటుందని టీడీపీ భావిస్తోంది. ఇక్కడ నటుడు అలీకి ఇద్దామనుకుంటే ఆయన వైసీపీలోకి జంప్ చేశారు. ప్రస్తుతం  హిదాయత్ తో పాటు  షౌకత్, షరీఫ్, రియాజ్ ఆశిస్తున్నారు. ఇక గుంటూరు పశ్చిమ విషయానికి వస్తే.. ఇక్కడ గతంలో మోదుగుల వేణుగోపాలరెడ్డి గెలుపొందారు. ఆయన కూడా వైసీపీలకి వెళ్లారు. 



ప్రస్తుతం గుంటూరు పశ్చిమ స్థానం నుంచి కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన కృష్ణ మన్నవ సుబ్బారావు వంటి వారు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో తెనాలి, పొన్నూరు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను కేటాయించారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అభ్యర్థులు ఇంకా క్లారిటీ రాలేదు. జనసేన గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్ పేరు ఫైనల్ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: