ఎన్నికలు లాంచనమా. ఓటర్ల తీర్పు అన్నది ఓ సాంకేతికమైన అంశమా. ఏపీలో రాజకీయం చూస్తే అలా అనిపిస్తోంది. ఏపీలో శరవేగంగా రాజకీయ‌ పరిణామలు మారుతున్నాయి. నిన్నటి వరకూ ఉన్న బ్యాలన్సింగ్ సిటుయేషన్ ఇపుడు రివర్స్ గేర్ వేస్తోంది. తుపాన్ మాదిరిగా బలమైన గాలులు వీస్తున్నాయి.


ఏపీలో టీడీపీ బలం ఇపుడు తీసికట్టు అవుతోంది. అధికారం ఉన్నంతవరకే అయ్య వారి ఆడంబరాలు చూడాలి అన్నట్లుగా ఇపుడు ముంగిట్లో ఎన్నికలు ఉండడంతో అసలు  గుట్టు బట్టబయలవుతోంది. ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్న ద్రుశ్యాలు చూస్తూంటే  అసలు ఎన్నికల ముందే ఆ పార్టీ ఇంతలా పడిపోతోందా అనిపించకమానదు. టీడీపీ వయసు నలభయ్యేళ్ళు. ఎంతో  పటిష్టమైన పార్టీ. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. మరి అటువంటి పార్టీలో ఇపుడు ఏం జరుగుతోంది. మెల్లగా ఒక్కొక్కరు బయటకు పోతున్నారు.


వైసీపీ వైపుగా సాగుతున్న భారీ క్యూలు ఏపీలో టీడీపీ కోటలను ఎన్నికలు లేకుండానే కూల్చేస్తున్నాయి. వైసీపీ తుపాను ఇపుడు ఏపీలో ఉధ్రుతంగా వీస్తోంది. టీడీపీ కంచుకోటలనుకున్న  ఉత్తరాంధ్రలో సైతం వైసెపీ గాలి బలంగా వీస్తోంది. విశాఖ నుంచి లోకేష్ బాబు పలాయానమే అందుకు ఉదాహరణ. ఇక గోదావరి జిల్లా సంగతి చెప్పనక్కరలేదు అక్కడ నుంచి జోరుగా చేరికలు ఉన్నాయి. ఇంకో ముఖ్య విషయమేంటంటే క్రిష్ణ, గుంటూర్ జిల్లాలు టీడీపీకి బలమైన కోటలంటారు అక్కడ కూడా ప్రకంపనలు మొదలయ్యాయి


రాయపాటి సాంబశివరావు వంటి వారు సైకిల్ దిగిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో పెద్ద నాయకుదు మాంగుట శ్రీనివాసులురెడ్డి వైసీపీలో చేరిపోతున్నారు. మంత్రులు జవహర్, శిద్దా రాఘవరావు ఏకంగా హై కమాండ్ కే వార్నింగులు ఇస్తున్నారు. ఇదంతా ఎన్నికల ముందు అంటే కాదు, వారిలో దాగున్న అయిదేళ్ళ నాటి అసంత్రుప్తిగానే దీన్ని చూడాలి. మొత్తానికి ఎన్నికలకు ఇంకా పాతిక‌ రోజులు కూడా సమయం లేదు. మరి టీడీపీలో ఏం జరుగుతోంది. ఆ పార్టీ ఏమవుతోంది...


మరింత సమాచారం తెలుసుకోండి: