ఎన్నికల నగారా మోగింది. పార్టీలు, నేతలు సర్వస్వమూ ధారపోసి బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీగానే సొమ్ము పోగేసుకోవాల్సి వస్తుంది. ఎన్నికల ఖర్చు పెట్టేది కోట్లలో ఉంటే లెక్కల్లో చూపించేది మాత్రం అందులో 5శాతం మించి ఉండదు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు 2వేల నోట్లు చెలామణీలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ముంగిట పెద్ద నోట్లు అందుబాటులో లేకపోవడంతో నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ అనూహ్య కొరత వెనుక కారణాలేంటనేది కూడా అంతుచిక్కడం లేదు.

Image result for vote for notes in india

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయం వేడెక్కింది. వేసవి ఎండలతో పాటు..రాజకీయం కూడా అదే స్తాయిలో పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నేతలు ప్రచారంలో మునిగిపోయారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలన్నీ నిమగ్నమైపోయాయి. ఈసారి జరగబోయే ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా నిలుస్తాయని సాక్షాత్తూ ఎన్నికల సంఘమే ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీలు, నేతలు గెలుపుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు వెనుకాడడం లేదు. ఇందుకోసం అన్ని దారులూ చూసుకుంటున్నారు.

Image result for vote for notes in india

రాజకీయ పార్టీల నేతలందరూ పెద్ద నోట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. పెద్ద నోట్లయితే ఎక్కడికైనా పెద్ద మొత్తంలో చేరవేసేందుకు సులువుగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెద్ద నోటు రెండు వేల రూపాయలు మాత్రమే. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా 2వేల రూపాయల నోట్ల కొరత ఆందోళన కలిగిస్తోంది. అసలే ఓట్ల సమయం. నోటు ఇవ్వనిదే ఓటు వేసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో 2వేల రూపాయల నోట్లు బ్యాంకుల్లో కానీ, ఏటీఎంలలో కానీ అందుబాటులో లేకపోవడంపై నేతలు ఆందోళన చెందుతున్నారు.

Image result for vote for notes in india

అయితే ఇక్కడ మరో వాదన కూడా లేకపోలేదు.. ఓటర్లకు డబ్బులు పంచేందుకు నేతలు ముందుగానే డబ్బులను రెండు వేల రూపాయల నోట్లను డినామినేషన్ లోకి మార్పిడి చేశారని తెలుస్తోంది. అందుకే ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో... అది కూడా ఆంధ్రప్రదేశ్ లో 2వేల నోటుకు గిరాకీ బాగా పెరిగిందని టాక్. ఇది సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ఇది మున్ముందు మరింత పెరిగే ప్రమాదం ఉంది. పెద్ద నోట్ల రద్దు చేయాలని కేంద్రం వెయ్యి రూపాయల నోటును రద్దు చేసి.. రెండు వేల నోటును తీసుకువచ్చింది. ఇప్పుడిది నేతలకే పెద్ద తలనొప్పిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: