ఇప్పటికే టీడీపీ ఎంపీల లిస్ట్ బయటికి వచ్చింది. అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వైసీపీ జాబితా జగన్ విడుదల చేశారు. దశమి రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా  అధికారికంగా విడుదల అయ్యింది.  మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా... తొలి విడుతగా 9 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేశారు.

Image result for jagan

ఎవరూ ఊహించని విధంగా ఈ  తొలి జాబితాలో ప్రకటించిన తొమ్మిది మందిలో అత్యధికులు కొత్త మొహాలు కావడం విశేషం. ఇద్దరు మాత్రమే సిట్టింగ్ ఎంపీలు. ఏడుగురు కొత్తవారు... వారిలో ఇద్దరు మహిళలు. 1.అరకు - గొడ్డేటి మాధవి 2. అమలాపురం- చింతా అనురాధ 3.రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 4.కడప- వైఎస్ అవినాష్ రెడ్డి 5.హిందుపురం - గోరంట్ల మాధవ్  6 అనంతపురం  - తలారి రంగయ్య7.బాపట్ల - నందిగం సురేష్  8. చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప 9 .కర్నూలు - సంజీవ్ కుమార్. 

Image result for jagan

అయితే ప్రకటించిన అభ్యర్థులు అందరు కొత్త వారు కావటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే అనూహ్యంగా హిందూ పురం ఎంపీగా గోరంట్ల మాధవ్ ను ఎంపిక చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా మిగతా 16 మంది ఎంపీల జాబితాను విడుదల చేయాల్సిఉంది. అయితే ఎంపీల అందరు కొత్త వారు అయినా జగన్ ను చూసి ఓట్లు వేస్తారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: