ఈ మధ్యనే ఒక సభలో పవన్ కళ్యాణ్ మీరు జనసేనను తొక్కేయడానికి ఎన్ని ఎత్తులు వేసుకుంటారో వేసుకోండి వాటికి పై ఎత్తులు వేయకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అన్నారు. తరువాత తన మొదటి లిస్టు లో కుర్రవాడైన గెడేల శ్రీనివాస్ ను వైజాగ్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ అతను ఆ తర్వాత రోజే వైఎస్ఆర్సిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో అందరూ రాజకీయం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అని పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే తెలిసి వచ్చి ఉంటుంది అని అన్నారు.

తరువాత మొదలైంది అసలైన గేమ్. పవన్ కు సోషల్ మీడియాలో ఉన్న అపారమైన సపోర్టు గురించి చెప్పక్కర్లేదు. ఒక్కసారిగా గా శ్రీనివాస్ ను తమ పార్టీ నుండి తప్పించినట్లు వార్తలు బయటకు వచ్చేసాయి. అతనిపై ఉన్న అవినీతి ఆరోపణలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం కావడం మూలంగా అతన్ని పార్టీ నుండి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా బయటకు పంపినట్లు విషయం బయటకు వచ్చింది. అది జరిగిన మరికొద్ది గంటల్లోనే మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ పవన్ తో భేటీ కావడం, పక్కరోజు పొద్దున్నే జనసేన లో చేరడం వెనువెంటనే జరిగిపోయాయి. ఎంతో నిజాయితీగల వ్యక్తిగా పేరున్న జేడీ ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని జగన్ ను జైలుకు పంపించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో తాను ఎలాంటి నాయకులని పార్టీలోకి కోరుకునేది అన్న విషయం విమర్శకులకు మొహం మీద కొట్టినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: