2019 ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు ప్రచారాన్ని మొదలెట్టాయి. అయితే నెల్లూరులో జరిగిన సభలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారినాయి. నెల్లూరుకు చాలా నిధులు ఇచ్చామని అభివృద్ధి చేశామని కాబట్టి మాకే ఓట్లు వేయాలని మాకు తప్ప వేరే వారికి ఓట్లు అడిగే హక్కు లేదని చంద్రబాబు మాట్లాడినారు. 
Image result for chandra babu
అయితే నెల్లూరులో టీడీపీ పార్టీ చాలా వీక్ గా ఉందని చెప్పాలి. 2014 ఎన్నికల్లో పది సీట్లలో కేవలం మూడంటే మూడే సీట్లను సంపాదించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం ఘోరంగా తయారైంది. టీడీపీ పార్టీ నుంచి నాయకులూ ఇప్పుడు వైసీపీలోకి జంప్ అవుతుండటంతో ఆ పార్టీ పరిస్థితి ఎటుకాకుండా తయారవుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నట్టుండి ఉండి టీడీపీ కి హ్యాండ్ ఇవ్వటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అలాంటిది చంద్రబాబు పదికి పది సీట్లు మావే అని చెప్పడం విడ్డురమే. 
Image result for chandra babu in nellore
 నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు మళ్లీ సీటు ఇచ్చింది టీడీపీ. కానీ ఆయనకు టీడీపీ నుంచి పోటీ చేయండ ఇష్టం లేదు. ఎందుకంటే పోయినసారే గెలవనప్పుడు ఇప్పుడు ఎలా గెలుస్తాం అనేది ఆయన పాయింట్. అయినా కూడా అయిష్టంగానే ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఈ లోగా సడన్ గా ఆయన ఫోన్ కి ఒక మేసేజ్ వచ్చింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంట్రాక్టు పనుల తాలూకు డబ్బులు రూ.43 కోట్లు ఆయన ఎక్కౌంట్ లో పడ్డాయి. అంతే ఆయన ఎన్నికల ప్రచారం నుంచి సడన్ గా మాయమైపోయారు. ఫోన్ కూడ స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈయన పార్టీ మారడంతో నెల్లూరు టీడీపీ నైరాశ్యంలో ఉందని చెప్పక మానదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: