తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమితులయ్యారు.  ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దరిమిల ఆయన రెండో సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.  ఆయన తనయుడు ఐటి మినిస్టర్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.  సిరిసిల్ల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఇక కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపిగా కొనసిగిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిదే.  ఈ నేపథ్యంలో ఎంపీ కవితకు పసుపు రైతులు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసేందుకు సుమారు వెయ్యి మంది పసుపు రైతులు సిద్ధమవుతున్నారు. 
Image result for Turmeric former nizamabad
గత కొంత కాలంగా పసుపు రైతులు తమ సమస్యలు రాష్ట్రం కానీ..కేంద్రం కానీ పట్టించుకోవడ లేదని ఈ నేపథ్యంలో తమ నిరసన ఈ విధంగా వినూత్నంగా తెలిపేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తుంది.  సాధారణంగా ఒక నియోజకవర్గంలో 10 నుంచి 20 మంది పోటీ చేస్తేనే ఈవీఎం బ్యాలెట్‌పై పేరు సరిపోక నానా ఇబ్బందులు పడుతుంటారు.  అలాంటిది ఏకంగా వెయ్యి మంది పోటీచేస్తే...! వినడానికే షాకింగ్‌గా ఉంది. 
Related image
కాగా, పసుపును ఎక్కువగా పండించే 200 గ్రామాల నుంచి సుమారు వెయ్యి మంది రైతులు ఎన్నికల్లో పోటీచేస్తారని జాయింట్ యాక్షన్ కమిటీ వెల్లడించింది. పసుపును పండించే ఊళ్లలో గ్రామాభివృద్ధి కమిటీల నుంచి రూ.5,000-10,000 సేకరించి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తామని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 10 మంది రైతులు పోటీచేశారు. ఐతే ఈసారి ఏకంగా వెయ్యి మంది రైతులు పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏం జరగబోతుందని అంతటా ఆసక్తిగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: