వైసీపీ అధినేత జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు ఆరు నెలలు ఎన్నికల తర్వాత మూడు నెలలు అన్నట్టుగా చంద్రబాబు హామీలు ఇస్తున్నారని ప్రజలు ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలలో చాలా వెలుగులు నింపాయని..

Related image

కానీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైఎస్ పథకాలకు తూట్లు పొడిచారని సామాన్యుల బతుకులను రోడ్డున పడేశారని నిరుపేద జీవితాలకు విద్యను.. వైద్యాన్ని తన బినామీల కోసం దూరం చేశారని కేవలం దోచుకోవడానికే అన్నట్టుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని రాష్ట్రాన్ని అన్ని విధాలా బ్రష్టు పట్టించారు అని చంద్రబాబుపై మరియు టిడిపి ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు జగన్.

Image result for ys jagan meetings

ఇదే క్రమంలో రాబోతున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నవరత్నాలు రాష్ట్రంలో ఉన్న పేద వారి జీవితాలలో వెలుగులు నింపుతాయి అని వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడే విధంగా ప్రభుత్వ పథకాలు ఉంటాయని రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాబోతున్న పరిపాలన ఉంటుందని వైసిపి పార్టీ పేదల మనసులను అర్థం చేసుకునే పార్టీ అని పాదయాత్రలో పేదల జీవితాలను దగ్గరగా చూశాను అని కచ్చితంగా పేదల జీవితాల్లో నవరత్నాలు వైసీపీ పార్టీ పథకాలు అన్ని మేలు చేస్తాయని స్పష్టం చేశారు జగన్.



మరింత సమాచారం తెలుసుకోండి: