విశాఖ జిల్లాలో కంచుకోట లాంటి సీటు ఏదీ అంటే టీడీపీకి భీమిలీనే చెబుతారు. అలాంటి సీటు ఫేట్ ఇపుడు దారుణంగా మారుతోంది. అక్కడ ఎపుడైతే అవంతి శ్రీనివాస్ వైసీపీ తరఫున బరిలో నిలబడ్డారో టీడీపీకి చుక్కలు కనిపించాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం సీటుకి షిఫ్ట్ చేసుకున్నారు. ఇక నారా లోకేష్ కధ చెప్పాల్సింది లేదు. అటువంటి చోట ఇపుడు ఎట్టకేలకు ఒకరిని టీడీపీ ఎంపిక చేసింది.


మాజీ ఎంపీగా ఉన్న సబ్బం హరికి భీమిలీ టికెట్ ఇచ్చింది టీడీపీ. సబ్బం హరి పదేళ్ళ క్రితం అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ మధ్యలో మళ్ళీ ఆయన అంత యాక్టివ్ గా లేరు. భీమిలీలో పెద్దగా సంబంధాలు కూడా లేవు. అటువంటిది సబ్బం హరిని తీసుకొచ్చి టీడీపీ మీద డంప్ చేసింది. మరి హరికి టికెట్ ఇస్తే పని చేసేది లేదని మరో వైపు తమ్ముళ్ళు గోలపెడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే హరి తప్ప మరో ఆప్షన్ లేదంటోంది హై కమాండ్


ఇక దాదాపు నెల రోజులుగా అవంతి శ్రీనివాస్ భీమిలీలో పాతుకుపోయి మరీ ప్రచారం ఓ రేంజిలో హోరెత్తిస్తున్నారు. ఆయనతో పోటీ పడేందుకు ఇపుడు టీడీపీ అభ్యర్ధికి టైం కూడా సరిపోదు. పైగా హరి పట్ల లోకల్ టీడీపీ క్యాడర్ వ్యతికేంగా ఉంది. అయినా సరే భీమిలీ వీరుడు అవాలన్న ఆరాటంలో హరి ఉన్నారు. చిత్రమేంటంటే హరికి ఇంతవరకూ టీడీపీలో మెంబర్ షిప్ కూడా లేదు. మరి కంచుకోటలో టీడీపీకి చెందని వారికి టికెట్ ఇవ్వడం అంటే తమ్ముళ్లకు మండిపోదా. చూడాలి మరి హరి పోరాటం ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: