ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పతనం నిశ్చయం అయిందని అర్థమౌతూ ఉంది. అందుకే ఆయన నిరాశా నిస్పృహలతో తనమునకలై పోతున్నట్లు ప్రతి సభలోనూ ఆయన తన రాజకీయ వ్యతిరేఖులను వ్యక్తిగత శత్రువుల్లా చూస్తూ అసభ్యకర భాషను ఉపయోగిస్తూ ఉపన్యాసాలు ఇస్తున్నది జనమంతా చూస్తూనే ఉన్నారు. ఆనాగరికంగా అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి తన తోటి రాజకీయ ప్రతిపక్షాలను విమర్శించేటప్పుడు ఆయనాయకుల వ్యక్తుల రాష్ట్ర ప్రజలని నిందించే అనాగరిక స్థాయికి చేరిపోతోంది ఆయన బాషన. అదే విషయం ఈ సంఘటనతో అర్ధమవుతుంది.

Image result for prashant kishor vs chandrababu 

“ఓటమి తథ్యమని తేలడం ఎంతటి రాజకీయ నాయకుడినైనా దెబ్బతీస్తుంది. ణారా చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తున్న భాష నా కేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. సర్‌!జీ! బిహార్‌ ను కించపరిచేలా దుర్భాషలాడటం కన్నా, ఏపీ ప్రజలు మీకు ఓటు ఎందుకు వెయ్యాలనే దానిపై ఫోకస్‌ చేయాలి” అని ప్రశాంత్‌ కిషోర్‌ ట్విటర్‌ లో హితవు పలికారు. 

 

ఒంగోలు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ, కేసీఆర్‌ క్రిమినల్‌ రాజకీయాలు చేస్తున్నారని, బిహార్‌ బంది పోటు ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీలో లక్షలాది ఓట్లను తొలగించారని అడ్డగోలుగా చేసిన ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు.

 Image result for prashant kishor vs chandrababu

ప్రశాంత్ కిషోర్ అలియస్ పీకే జగన్ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఉన్నారు పీకే. గ్రౌండ్ వర్క్ నుంచి స్ట్రాటజీల విషయంలో పీకే జగన్ కు తన సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇది వరకూ నరేంద్రమోడీకి స్ట్రాటజిస్టుగా వ్యవహరించిన పీకే దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ క్రమంలో జగన్ ఆయనను నియమించుకున్నారు. వాళ్లపనేదో వాళ్లు చేస్తున్నారు. ఏ రాజకీయ నేతకు అయినా తన సలహాలను అమ్ముకోవడం పీకే మార్కెటింగ్. ఇదో నయా ప్రొఫెషనల్ కెరీర్ లాంటిది. ఆయన పని ఆయన చేసుకొంటున్నారు. ఒకవేళ ఇదే పీకేను  చంద్రబాబు నాయుడు హయర్ చేసి ఉంటే ఆయన కోసం పని చేసే వారేనమో. జగన్ ముందుగా మేల్కొన్నాడు అప్పుడే పీకేతో ఒప్పందం చేసుకున్నాడు.
Image result for prashant kishor vs chandrababu

ఇలాంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జగన్ తరఫున పని చేస్తూ ఉన్నారు. ఈ పరిణామం చంద్రబాబులో బాగా అసహనాన్ని కలగిస్తున్నట్టుగా ఉంది.  అందుకే చాన్నాళ్లు గా పీకే మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ‘పీకే ఓట్లను తొలగిస్తున్నాడు - బీహారీ గజదొంగ - ’అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తూ ఉన్నారు. అయినా ఓట్లను తొలగించే శక్తి పీకే కు ఉంటుందా? అనేది వేరే వాదన.

Image result for prashant kishor vs chandrababu 

ఇష్ట మొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ చెలరేగి పోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తొలిసారి స్పందించారు.  ఓటమి కళ్లముందు మెదులుతుంటే చంద్రబాబులాంటి నేతలు అడ్డగోలుగా మాట్లాడటంలో ఆశ్చర్యమేమీ లేదని, బిహార్‌ ను కించపరిచే రీతిలో దుర్భాషలు ఆడటం కన్నా ఏపీ ప్రజలు మీకు ఎందుకు ఓటెయ్యాలనే దానిపై ఫోకస్‌ చేయండి అంటూ చంద్రబాబుకు ఘాటుగా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: