గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలసి పోటీ చేసిన గాని కేవలం ఐదు పర్సంటేజ్ ఓటు తేడాతో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత జగన్..ప్రతిపక్ష నేతగా అద్భుతంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై ఊహించని విధంగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను కళ్లకు కట్టినట్లుగా బయటకు తీసుకువచ్చారు.

Related image

ముఖ్యంగా తన పాదయాత్రతో కూటమిగా ఉన్న మూడు పార్టీలను చీల్చుకుంటూ అడుగులు వేస్తూ..ప్రతి సామాన్యుడు భాదను వింటూ వారికి భరోసా ఇస్తూ నవరత్నాలు వంటి పథకాలను రాబోతున్న ప్రభుత్వంలో తీసుకు వస్తానని తెలియజేస్తూ ఎవరూ భయపడవద్దు అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ జగన్ చేపట్టిన పాదయాత్ర ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Image result for ys jagan meetings

ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో కూడా జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఇప్పటికే ఆంధ్ర ప్రజలు జగనే ముఖ్యమంత్రి అని ఎక్స్ ఐ పోయారని కేవలం ఎన్నికల మాత్రమే మిగిలి ఉన్నాయని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

Image result for ys jagan meetings

ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరుపున గెలిచి తమ స్వార్ధ రాజకీయాలకోసం వైసిపి పార్టీని మరియు జగన్ ని మోసం చేసిన ప్రతి ఒక్కరికి రాబోతున్న ఎన్నికల్లో అద్భుతంగా చెక్ పెట్టడానికి రాజకీయంగా వారికి మనుగడ లేకుండా..వైసిపి పార్టీని మోసం చేసిన ఫిరాయింపు రాజకీయ నేతలకు రాబోతున్న ఎన్నికలలో వైసీపీని వీడిన వారందరికీ వడ్డి, చక్రవడ్డి, బారువడ్డీతో కలిపి వారు చేసిన మోసానికి మూల్యం చెల్లించే విధంగా జగన్ ఇప్పటికే అద్భుతమైన స్కెచ్ వేశారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: