నిన్న చెప్పానుగా భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ దెబ్బకి పవన్ చిత్తుచిత్తుగా ఓడిపోతారని.. అందుకే పవన్ ముందు జాగ్రత్తగా భీమవరం నుండి తిరుపతికి షిఫ్ట్ అయ్యాడు.. పశ్చిమగోదావరిలో రాజుల ప్రభావం ఎక్కువ.. వారి మంచితనం, పెద్దరికం వలన రాజులు చెప్పినట్టుగానే ఇతర కులాల వారు నడుచుకుంటారు.. ప్రస్తుతం రాజులు ఏకతాటిపైకి వచ్చి వైసీపీకి మద్దతుగా ఉన్నారు.. ఈమధ్య నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు గారు వైసీపీలో చేరడంతో పశ్చిమగోదావరిలో వైసీపీ విపరీతంగా పుంజుకుంది.. అలాగే భీమవరంలో ప్రభాస్ కి చాలా క్రేజ్ ఎక్కువ.. రెండేళ్ల క్రితం భీమవరంలో పవన్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి మధ్య పెద్ద వార్ జరిగింది.. పవన్ మీద బలమైన కసితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు పవన్ అక్కడ పోటీ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ మామూలుగా దెబ్బతీయరు.. ఆ భయంతోనే ముందు జాగ్రత్తగా పవన్ భీమవరం నుండి తిరుపతికి పారిపోయాడు.. 


రాయలసీమలో జనసేనకి ఊపు రావడం కోసమే పవన్ తిరుపతికి షిఫ్ట్ అయ్యాడు అనేది పిల్ల పవన్ ఫ్యాన్స్/ కాయిన్స్ వాదన.. కానీ నిజం ఏంటంటే తిరుపతిలో కూడా కాపుల ఓట్లు ఎక్కువ.. అందుకే అక్కడ చేరాడు.. ఒకవేళ నిజంగానే రాయలసీమలో పోటీ చెయ్యాలనుకుంటే అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం అనంతపురంలో పోటీ చేసి ఉండేవాడు కదా.. కానీ చెయ్యడు, ఎందుకంటే అక్కడ కాపు ఓటర్లు తక్కువ.. ఐదేళ్లు సినిమాలు చేసుకుని చంద్రబాబు చెప్పినట్టు డ్రామాలు చేసిన పవన్ని జనాలు నమ్మట్లేదు.. ఇప్పుడు కూడా పవన్ని చంద్రబాబు మనిషిలాగే చూస్తున్నారు తప్ప జనాలు ఆయనని నమ్మట్లేదు.. ఆ భయంతోనే కనీసం కాపు ఓట్లతో అయినా గట్టెక్కవచ్చని తిరుపతి గాజువాక భీమవరం లాంటివి వెతుక్కున్నారు. 


అయినా వాడి పిచ్చి తాపత్రయమే కానీ పవన్ గారు తిరుపతిలో కూడా గెలవడు.. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి ఇచ్చిన ఝలక్ కి తిరుపతి ఓటర్లు బాగా కోపంగా ఉన్నారు.. ఇప్పుడు పవన్ కి ఆ కోపం రుచి చూపించడానికి రెడీగా ఉన్నారు.. అలాగే తిరుపతిలో వైసీపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డిగారు చాలా బలంగా ఉన్నారు.. ఇక పావలాని చాలా గట్టిగా ఓడిస్తాడు.. తర్వాత ఏముంది?? ప్రజారాజ్యం రిపీట్ అవుతుందా అని ఏపి ప్రజలు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: