నాయకుడంటే.. ముందుండి నడిపించేవాడే కాదు.. తనను నమ్మినవాళ్లకు వెనుక అండదండగా ఉండటం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారికి భరోసా ఇవ్వడం.. నేనున్నానన్న నమ్మకం ఇవ్వడం.. ఈ లక్షణాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిలో ఉండేవి. రాజశేఖర్‌రెడ్డిని నమ్మినవాళ్లను కాపాడుకున్నాడు.. కష్టాల్లో ఆదుకున్నాడు.. విమర్శలకు లెక్కచేయకుండా .. అధికారం వచ్చినప్పుడు అందలాలు ఎక్కించాడు. 

jagan nandigam suresh కోసం చిత్ర ఫలితం


ఇన్నాళ్లూ జగన్‌లో ఆ లక్షణం లేదని విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు జగన్ కూడా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. నందిగం సురేశ్ వంటి వారికి అవకాశం ఇవ్వడం ద్వారా తాను నిజమైన వైఎస్ వారసుడినని జగన్ నిరూపించుకున్నాడు. ఈ లక్షణం ఏపీ రాజకీయాల్లో జగన్‌ను అజేయశక్తిగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

సంబంధిత చిత్రం

అలాగే జగన్‌ వైఎస్‌ఆర్‌తో పాటు ఎన్టీఆర్ లక్షణాలు కూడా సంతరించుకుంటున్నాడు. రాజకీయ రంగానికి చెందినవారు కాకపోయినా సరే.. విషయం ఉన్న వ్యక్తి అని నమ్మితే వారికి రాజకీయంగా అవకాశాలివ్వడం నేర్చుకున్నాడు. ఈ లక్షణం ఎన్టీఆర్‌లో మెండుగా ఉండేది. 
ysr and ntr కోసం చిత్ర ఫలితం


తెలుగు రాజకీయాలకు ఆయన ఎంతో కొత్త నీరు అందించాడు. విభిన్న రంగాల నుంచి మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి రాజకీయంగా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నందిగం సురేశ్ వంటి వారికి అవకాశం ఇవ్వడం ద్వారా తన నాయకత్వాన్ని మెరుగు పరుచుకున్నానని రుజువు చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: