విశాఖ ఎంపీ సీటు విషయంలో అనేక కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ గెలుపు గుర్రాలు ఎవరన్నది ఇప్పటికి తేలకపోయినా తెర వెనక జరుగుతున్న పరిణామలు చూస్తూంటే పెద్ద వ్యూహాలతోనే  అన్ని పార్టీలు ఉన్నాయని అర్ధమవుతోంది. ప్రధానంగా ప్రశాంత నగరమైన విశాఖలో ఎంపీ అంటే ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు. ఎందరో ఉద్దండులు ఈ పదవిని నిర్వహించారు.


ఇక లేటేస్ట్ గా పోటీ చేస్తున్న వారి జాబితాను ఒకసారి పరిశీలిస్తే టీడీపీ నుంచి పోరాడి టికెట్  తెచ్చుకున్న బాలయ్య అల్లుడు, దివంగత నేత ఎంవీవీఎస్  మూర్తి మనవడు శ్రీ భరత్ ఉన్నారు.  వైసీపీ నుంచి చాలా కాలంగా పనిచేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఇక కొత్తగా జనసేన నుంచి మాజె జేడీ లక్ష్మీ నారాయణను దింపారు. అకస్మాత్తుగా వచ్చి పడిన ఈ దిగుమతి సరుకుని జనం ఎంతమేరకు ఆమోదిస్తారన్నది పక్కన పెడితే మాజీ జేడీ మొదట చేరెది  టీడీపీ  అని అంతా అనుకున్నారు.  అ  తరువాత జనసేనలో చేరిపోయి వెంటనే ఆయన టికెట్ దక్కించుకున్నారు. దీన్ని బట్టి చూస్తూంటే తెర వెనక ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


టీడీపీలో పునాది నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి  ఎంవీవీఎస్ మూర్తి. ఆయన తన జీవితం అంతా పార్టీకే అంకితం చేశారు. బతికుంటే ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్ధి అన్నది అందరికీ తెలిసిందే. ఇక ఆయన మనవడు శ్రీ భరత్ తాత రాజకీయ వారసత్వాన్ని తీసుకుని పార్టీకి కొద్ది నెలలుగా పనిచేస్తున్నారు. శ్రీ భరత్ అభ్యర్ధిత్వాన్ని పార్టీలోని ఎమ్మెల్యే అభ్యర్ధులంతా  అంతా ఎపుడో ఆమోదించారు. అక్కడ శ్రీ భరత్ కంటే బలమైన క్యాండిడేట్ కూడా టీడీపీకి లేరు. పైగా భరత్ బాబుకు దగ్గర చుట్టం. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా భరత్ సీటుని చివరి నిముషం వరకూ హై కమాండ్ ఆమోదించలేదు. ఇక టీడీపీ తరఫున సీనియర్ నేతలు పల్లా శ్రీనివాస్, గంటా స్రీనివాస్ అనుకునప్పుడు జనసేన ప్రకటించిన  అభ్యర్ధి గేదేల శ్రీనివాస్. ఆయన తరువాత వైసీపీలోకి వెళ్ళిపోయారు.


ఎపుడైతే శ్రీ భరత్ పేరు బయటకు వచ్చిందో జనసేన నుంచి లక్ష్మీనారాయణ పేరు ఠక్కున  వచ్చేసింది. అంటే ఇదేమైనా  అనుకోని జరిగిందా అన్న మాట కూడా  వినిపిస్తోంది.  ఇక‌ ఇపుడు జరిగేదేంటి అన్నదే అందరిలో ఉత్కంఠగా ఉంది. మాజీ జేడీకి విశాఖ ఎంపీ సీటు హద్దులు కూడా తెలియవు. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న ధైర్యం చేయడం వెనక కారణాలు ఏంటి. జనసేన తీరు చూస్తే ఎక్కడా పెద్దగా బలంగా లేదు. అంటే ఓ అవగాహన మేరకే మాజీ జేడీ డంప్ అయ్యారన్న చర్చ వస్తోంది. టీడీపీలో క్రాస్ జరిగితేనే ఇపుడు ఈ మాజీ పోలీస్ అధికారి గెలుస్తారు. అదే జరిగితే మూర్తి మనవడు  భవిష్యత్తు ఏంటి అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అంటే టీడీపీకి బాగా అనుకూలం అని ప్రచారంలో ఉన్న మాజీ జేడీ కోసం బాలయ్య అల్లుడిని బలి చేస్తారా అన్న దౌట్లు ఒక్కసారిగా పుట్టుకువస్తున్నాయి. ముందు ముందు రోజుల్లో ఒక్కో దానికి సమాధానం వస్తుంది. తెరలు కూడా తొలగిపోతాయి  అంటున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: