ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాగాని టీడీపీ, జనసేన మరియు వైసిపి పార్టీల మధ్య పోటా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా త్రిముఖ పోటీ నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు బిజెపి పార్టీలు కలిసి పోటీ చేసిన సంగతి మనకందరికీ తెలిసినదే.

Image result for jagan with formers

అయితే తాజాగా మాత్రం జనసేన పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న క్రమంలో టిడిపి పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అయ్యింది. మరోపక్క గత సార్వత్రిక ఎన్నికల్లో  కొద్దిపాటి ఓటింగ్ తేడాతో అధికారం కోల్పోయిన వైసిపి పార్టీ ఎప్పటిలాగానే ప్రజల్ని నమ్ముకుని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అన్నివిధాల సిద్ధమైంది.

Image result for ap political leaders

ముఖ్యంగా ఈ మూడు పార్టీలలో పక్కా వ్యూహా లతో ప్రజలకు క్లారిటీ హామీలు ఇస్తూ ప్రజల నమ్మకాన్ని పొందుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేల ఫలితాలలో దూసుకెళ్ళిపోతున్నరు జగన్. ఇదే క్రమంలో చంద్రబాబు కూడా ప్రస్తుతం తన హయాంలో జరిగిన పనులను ప్రజలకు తెలియజేస్తూ సభలలో పాల్గొంటూ ప్రజాభిమానాన్ని పొందడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Image result for ap political leaders

మరోపక్క గత నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న పవన్ కళ్యాణ్ గత ఏడాది మార్చి నెల నుండి టిడిపి పార్టీ అవినీతి పార్టీ అంటూ చంద్రబాబు పై మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసి టీడీపీకి తెలిపిన మద్దతు ఉపసంహరించుకుని 2019 ఎన్నికలకు జనసేన పార్టీని సిద్ధం చేశారు పవన్. మొత్తం మీద ఈ మూడు పార్టీల నేతలు ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో ఉండటంతో ఆంధ్రాలో రాజకీయం రసవత్తరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: