ఎక్కడైనా ఒక రాజు మంత్రి ఉంటారు. కాకపోతే మంత్రులు ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు. కానీ ఇద్దరు రాజులు, ఒక మంత్రి ఉండడం చిత్రమే మరి. రాజు గెలుపు కోసం మంత్రి సలహాలు ఇవ్వాలి. మరి మంత్రిని ఓడించేందుకు రాజులే  ముందుకు వస్తే సీన్ ఎలా ఉంటుంది.


విశాఖ ఉత్తరం అసెంబ్లీ సీట్లో ఇపుడు అదే జరుగుతోంది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు రాజులు ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. ఒకరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మరొకరు వైసీపీ అభ్యర్ధి కేకే రాజు. ఇక మంత్రిగా గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు మధ్యనే  పోటీ జరగనుంది. ఇక్కడ జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్ ని పోటీకి దింపినా ఆ ప్రభావం తక్కువే.


ఇదిలా ఉండగా ఉత్తరంలో కాపులు, వెలమలు, క్షత్రియులు, బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు వీరికే సీట్లు కూడా ఇచ్చాయి. మంత్రి గంటా ప్రతి ఎన్నికకూ సీటు మారడం వివాదమవుతోంది. ఈసారి ఆయన సీటు మార్చి తన సెంటిమెంట్ ని కంటిన్యూ చేశారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కూడా గట్టి అభ్యర్ధిగానే ఉన్నారు. ఆయన అయిదేళ్ళలో జనాలకు బాగానే చేరువ అయ్యారు. పైగా ఆయన ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్షాన పనిచేయడం వల్ల స్టేట్ ఫిగర్ గా కూడా అయిపోయారు. ఆ ఇమేజ్ ఇపుడు ఆయనకు అండగా ఉంటోంది.


ఇక వైసీపీ అభ్యర్ధి విషయానికి వస్తే ఆయన లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. చాప కింద నీరులా జనాలకు చేరువ అవుతున్నారు. నామినేషన్ కి వచ్చిన జనం చూస్తే కే కే రాజు సత్తా ఏంటో తెలిసింది. ఇక కొత్తగా వచ్చిన గంటాకు ఉత్తరం లో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. గత ఇరవయ్యేళ్ళలో ఎపుడూ ఇక్కడ టీడీపీ గెలవలేదు. పైగా క్యాడర్ బాగా చెదిరిపోయింది. ఇక సీటు కోసం పోటీ పడి అలక బూనిన నేతలు ఉన్నారు. అందరినీ ఒప్పించి ఆయన గెలవాలి. ఐతే రాజకీయ చతురుడు  అయిన గంటా గెలవడం ఖాయమని ఆయన అనుచర వర్గం అంటోంది. మరో వైపు  రాజులు ఇద్దరూ కూడా మేమే కింగులమని అంటున్నారు. దాంతో రసవత్తరం ఉత్తరంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: