గత సార్వత్రిక ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీ అంటూ మరియు కాపులను బీసీల్లో చేరుస్తామంటూ..ఇంకా అనేక ఆచరణ కానీ అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు అంటూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు ఇటీవల అనేకసార్లు కామెంట్లు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for chandrababu

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ ఎన్నికల ముందు మూడు నెలలు ఎన్నికల తర్వాత ఆరు నెలలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు వచ్చిన హామీలను కూడా చంద్రబాబు ఇస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో స్పీడ్ బుల్లెట్ రైళ్లను తీసుకు వస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ పని చేయకుండా తన స్వార్ధ రాజకీయాలు చూసుకున్న చంద్రబాబు తాజాగా రాబోతున్న ఎన్నికలలో కూడా గత ఎన్నికల మాదిరిగానే నోటికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తుండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Related image

ఈ క్రమంలో ఇటీవల పార్టీకి సంబంధించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ ఆల్ ఫ్రీ అంటూ చంద్రబాబు ప్రకటించారని కొంతమంది అంటున్నారు. మరి ప్రస్తుతం ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు ఈసారి నమ్ముతారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: