టీడీపీ పార్టీ 2014 లో అధికారం లోకి వచ్చిన తరవాత అనేక రకాల పథకాలు ప్రయత్నించింది. చాలా వరకూ పథకాలు మాత్రం జనాల్లో నిర్వీర్యం అవగా కొన్ని అవినీతి పాలు అయ్యాయి అనే మాట వినపడింది.



రీసెంట్ గా పెట్టిన పెన్షన్ డబల్ చెయ్యడం లాంటివి ఎలక్షన్ కోసమే చంద్రబాబు చేస్తున్నారు అనే ఆరోపణలు వినపడ్డాయి. ఈ క్రమం లో పసుపూ కుంకుమ పథకాన్నే చంద్రబాబు పూర్తిగా నమ్ముకుని ఉన్నారు .



ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ పార్టీ మహిళా ఓటర్లు అందరూ తమకి పసుపూ కుంకుమ పథకం కారణంగా ఓట్లు వేస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ముఖ్యమంత్రి ఉన్నారు. డ్వాక్రా మహిళల తో పాటు కొన్ని వర్గాల  ఇతర స్త్రీల కి ఈ పథకం వర్తిస్తుంది . అయితే ఈ పసుపూ కుంకుమ విషయం లో ఖచ్చితంగా తలనొప్పులు ఉంటాయి అనే మాట వినపడుతోంది. ఎందుకంటే ఈ పథకం అందినవారు చాలా తక్కువగా ఉన్నారు.




ఈ పథకం జారుడుబండ మీద పోసినట్టు కాస్తంత గాలికి కాస్తంత నేలమీదకి వెళ్ళిపోతోంది అనీ ఇది వర్క్ అయ్యే విషయం కాదు అని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వచ్చాయి ఒకప్పుడు. ఇందులో అవినీతి కూడా జరుగుతోంది అనే ఆరోపణలు ఉన్న పరిస్థితి లో ఈ వ్యవహారం ఎంతవరకూ వర్క్ అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: