కృష్ణాజిల్లాలో గుడివాడ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ టిడిపి ఎలాగైనా పాగా వేయాలని తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలి అని తీవ్ర ప్రయత్నాలు జరుపుతోంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుండి గుడివాడలో గెలుస్తున్న కొడాలి నాని ని ఎలాగైనా ఓడించాలని టిడిపి అధినేత చంద్రబాబు బెజవాడ కు చెందిన దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపారు.

Image result for kodali nani vs devineni avinash

ఈ సందర్భంగా ఇటీవల ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని మాట్లాడుతూ..గుడివాడ నియోజకవర్గంలో బెజవాడ గూండాలను రౌడీలను దింపి రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారంటూ..ఇందుమూలంగా నే దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపారని..ఎక్కడ నుండి ఎవరు వచ్చినా కానీ గుడివాడలో ఎగిరేది వైసీపీ జెండా అని.

Image result for kodali nani vs devineni avinash

ఎందుకంటే కొడాలి నాని ది ఇల్లు గుడివాడ అని..కొడాలి నాని రాజకీయం మొత్తం గుడివాడ చుట్టూనే తిరిగింది కొడాలి నాని గుడివాడ ప్రజలకు ఏం చేశారు అని తెలుసు అంటూ నా ఇల్లు తెలుసుకుంటూ నా ఫోన్ నెంబర్ తెలుసు అంటూ పార్టీ కార్యక్రమంలో కొడాలి నాని ప్రసంగించారు. నా ముందు పిల్ల రాజకీయ నాయకుడిని రంగంలోకి దింపిన చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతాం అని పేర్కొన్నారు కొడాలి నాని. బెజవాడలో వేసిన రౌడీ వేషాలు గుడివాడ లో వేస్తే ఊరుకోం అంటూ నియోజకవర్గంలో ఏ సామాన్యుడికె గానే కార్యకర్తకె గానే ఏదైనా జరిగితే...ఊరుకునే ప్రసక్తే లేదని...ఘాటు గా మాట్లాడారు నాని.



మరింత సమాచారం తెలుసుకోండి: