కడప జిల్లాలో తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి రాజశేఖర్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు.  బద్వేలు నియోజకవర్గంలో పోటీకి రాజశేఖర్ ను చంద్రబాబునాయుడు ఏరికోరి ఎంపిక చేశారు. ఇక్కడ పోటీ చేయటానికి చాలామందే ఉత్సాహం చూపించారు. సీనియర్ నేత విజయజ్యోతి అయితే గట్టిగా ప్రయత్నించారు. అయినా చంద్రబాబు మాత్ర ఎంచేతనో రాజశేఖర్ వైపే మొగ్గుచూపించారు.

 

ఎప్పుడైతే చంద్రబాబు అభ్యర్ధిని ప్రకటించారు వెంటనే బిఫారం కూడా ఇవ్వటం, నామినేషన్ వేయటం అంతా అయిపోయింది. ప్రచారం కూడా మొదలుపెట్టారు. సమస్యంతా ఇక్కడే మొదలైంది. రాజశేఖర్ టిడిపి అభ్యర్ధిగా నామినేషన్ వేయటంతో విజయజ్యోతి పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసి ప్రచారం మొదలుపెట్టేశారు.

 

ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా జ్యోతి నామినేషన్ వేశారో నియోజకవర్గంలో కాస్త పేరున్న నేతలంతా ఆమెవెంటే నడుస్తున్నారు. అసలే ఇక్కడ వైసిపి చాలా స్టాంగ్. దానికితోడు టిడిపిలో రెబల్ అభ్యర్ధి. ఆపైన నేతలంతా ఇండిపెండెంట్ కే మద్దతు. ఇక చెప్పేదేముంది ? వెంటనే రాజశేఖర్ తాను పోటీలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు.

 

అంతేకాకుండా టికెట్ రావటానికి ముందు తాను ఇచ్చిన రూ 3 కోట్లు తిరిగిచ్చేయాలని రచ్చ మొదలుపెట్టారు. ఆదివారం చంద్రబాబు ఇక్కడ ప్రచారానికి వస్తున్నారు. ఈ నేపధ్యంలో అభ్యర్ది పోటీనుండి తప్పుకోవటమే కాకుండా తానిచ్చిన 3 కోట్లు తిరిగిచ్చేయాలని చేస్తున్న రచ్చ పార్టీలో పెద్ద తలనొప్పిగా తయారైంది. అందుకే జిల్లా పార్టీ నేతలంతా రాజశేఖర్ ను బుజ్జగిస్తున్నారు. మరి అభ్యర్ధి ఏం చేస్తారో చూడాలి ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: