ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణ భారతంపై కన్నేశారా? లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బలం పెంచుకునేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నారా?. దీనిలో భాగంగానే బెంగళూరు నుంచి ఆయన పోటీ చేయనున్నారా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణ భారతాన్ని లక్ష్యంగా చేసుకో బోతోందన్న సూచనలు వినిపిస్తున్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్ ల నుంచి బరిలోకి దిగిన మోడీ తాను అనుకున్నది సాధించారు. గుజరాత్ తో క్లీన్ స్వీప్ చేయటం మత్రమే కాదు,  యూపీలో క్లీన్ స్వీప్ అన్నంత విజయవంతంగా పలితాలు వెల్లడయ్యాయి. 
modi contests from bangalore south కోసం చిత్ర ఫలితం
అయితే, తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయన యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. దీనికి తోడుగా మరో స్థానం నుంచి ఆయన ఎన్నికల బరి లోకి దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి పోటీకి దిగనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారతావని లో తాము టార్గెట్ చేసిన ప్రతి ప్రాంతంలో కమలం జెండాను ఎగురవేసిన నరేంద్ర మోడీ బృందానికి కొరుకుడుపడని ప్రాంతంగా దక్షిణ భారతం నిలిచింది. 


దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే,  కర్ణాటకలో ఆ పార్టీ మెరుగైన పరిస్థితి నెలకొంది. ఈ మధ్యన జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం పక్కా అన్న ప్రచారం జరిగినా, అది చేతికి వచ్చి నోటి వద్దకు రాకుండా చేజారిపోయింది. అప్పటి నుంచి కర్ణాటక పీఠాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న బీజేపీ తాజాగా నరేంద్ర మోడీనే బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇందుకు తగ్గట్లే, దివంగత కేంద్ర మంత్రి అనంత కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నఎంపీ స్థానంలో తొలుత ఆయన సతీమణి తేజస్విని అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావించారు.  కానీ, ఆమెకు బదులుగా నరేంద్ర మోడీని ఎన్నికల బరిలోకి దించితే మంచిదన్న భావనలో ఉన్నారని తెలుస్తుంది. 
ananta kumar tejaswini కోసం చిత్ర ఫలితం
కర్ణాటకలోని 28 ఎంపీ స్థానాలకుగాను బీజేపీ ఇప్పటికి 21 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా అందులో “బెంగళూరు సౌత్” పేరు లేకపోవటం అందరిని ఆశ్చర్యాని కి గురి చేసింది. దివంగత కేంద్ర మంత్రి సతీమణికి తొలి జాబితా లోనే పేరు ఉంటుందని భావించగా దానికి భిన్నంగా పేరు లేకపోవటం పెద్ద ఆసక్తికర చర్చకే దారి తీసింది. 
తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం బెంగళూరు సౌత్ స్థానం నుంచి నరేంద్ర మోడీ బరిలోకి దిగనున్నారని సమాచారం. 


బెంగళూరు సౌత్ స్థానం నుండి నరేంద్ర మోడీ పోటీ చేస్తే - దక్షిణాదిపై దృష్టి పెట్టిన కమలనాథులు, ప్రధాని మోడీని రంగంలోకి దింపటంద్వారా ఆ ప్రభావం మిగిలిన నాలుగు రాష్ట్రాల మీద అనుకూల వాతావరణం ఏర్పడ గలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  దక్షిణాదిన ‘నమో’ విజయం సాధించటం ద్వారా, ఆయనకు దక్షిణాది ప్రజల ఆమోదం కూడా ఉందన్న అభిప్రాయం కలిగేలా చేయటం కూడా ఒక వ్యూహం గా చెబుతున్నారు.
south is the target for modi now కోసం చిత్ర ఫలితం
మోడీ బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేసిన పక్షంలో, కర్ణాటకలో మెజార్టీ ఎంపీ స్థానాల్ని చేజిక్కించుకునే వీలు ఉండటంతో పాటు మోడీ మేనియా కర్ణాటక రాష్ట్రం నిండా వ్యాప్తి చెందగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇటీవల బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేయాలన్నబిజేపి కోరికకు  మోడీ సానుకూలంగా స్పందించక పోవటం - బెంగళూరు సౌత్ లో తేజస్విని తనకు తానే అభ్యర్థిగా ప్రచారం చేసుకోవటం లాంటి అంశాలు చూస్తే ప్రధాని బరిలోకి దిగుతారా?  లేదా? అన్నసందేహం మాత్రం కలుగకమానదు. అదే సమయంలోతాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో నరెంద్ర మోడీ బెంగళూరు సౌత్ ద్వారా రంగంలో దిగటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నరేంద్ర మోదీ ఇప్పటికే వారణాసి నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. దక్షిణాదిన కూడా తమకు బలం ఉందని నిరూపించేందుకే బెంగళూరు నుంచి పోటీ చేయాల ని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.  బెంగళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. అనంతకుమార్ 1996 నుంచి వరుసగా ఆరుసార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. మోదీ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 
ananta kumar tejaswini కోసం చిత్ర ఫలితం
అయితే మరణించటంతో ఆ టిక్కెట్‌ను అనంతకుమార్ భార్యకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోదీ బరిలో దిగుతున్నట్లు ప్రచారం జరగడంతో ఆమెకు నిరాశ తప్పేలా లేదు. అయితే నరేంద్ర మోదీ రెండుచోట్ల గెలిచిన తర్వాత బెంగళూరు సౌత్ స్థానానికి రాజీనామా చేస్తారని, ఉప‌ఎన్నికల్లో అనంతకుమార్ భార్యకు టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: