కృష్ణ జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. ఈ నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. 1978 లో స్వతంత్ర పార్టీ గెలవగా, 1994 లో టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ ప్రాబల్యం పెరిగింది. 2014 లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు మేక ప్రతాప్ అప్పారావు. ఇక్కడ రాజధాని వస్తుందని ఆశలు పెట్టుకున్న అక్కడి ప్రజలు వారి భుమలని అమ్ముకొని అప్పుల పాలయ్యారు. దీనితో అక్కడి టీడీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకత పెరిగింది.


ఈ సంఘటనలు అన్ని వైసీపీ అభ్యర్థి అయిన వెంకట ప్రతాప్ కు పెద్ద ప్లస్ అయ్యింది. ప్రజలు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు ఏం చేస్తాడు లే అని వారే సర్ధి చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేక అప్పారావు కాంగ్రెస్ ను వీడి గత ఎన్నికల్లో వైసీపీ లో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసి ముదరబోయిన వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. 1985 - 2009 వరకు ఆరు సార్లు ఎన్నికలు జరుగగా టీడీపీ పార్టీ ఇక్కడ 4 సార్లు గెలిచింది.


కోటగిరి హనుమంతురావు టీడీపీ పార్టీ కి గట్టి పునాది వేసారు. ఆ తర్వాత చిన్నం రామకోటయ్య దాన్ని కొనసాగించారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ నుంచి బరిలో దిగిన వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇక్కడ జనసేన కూడా పోటీ చేస్తుంది. అయితే పార్టీ అభ్యర్థి ఎవరో తెలియరాలేదు. కానీ పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యే జరగనుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గెలుపు ఎవరి వైపు నిలబడుతుంది అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: