హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పవన్ నామినేషన్ వేశాడు. భీమవరం విషయానికి వస్తే..ఇక్కడ కాపు సామాజిక వర్గంతో పాటు క్షత్రియ సామాజిక వర్గం కూడా ఎక్కువే. 

pawan vs prabhas కోసం చిత్ర ఫలితం


సాధారణంగా ఈ ప్రాంతంలో కాపు యూత్ పవన్ వైపు.. క్షత్రియ యూత్ ప్రభాస్ వైపు ఉంటుంటారు. గతంలో ఈ రెండు ఫ్యాన్  గ్రూపుల మధ్య చాలా గొడవలు కూడా జరిగాయి. మరి ఇప్పుడు పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ యూత్ ఫ్యాన్స్ పవన్‌కు వ్యతిరేకంగా పని చేస్తే పవన్‌ గెలుపు కష్టంగానే ఉంటుంది. 

AP Assembly Elections 2019, Bhimavaram Assembly, Pawan Kalyan Bhimavaram, Prabhas Fans Bhimavaram, Bhimavaram Kapu Votes, Bhimavaram Rajus votes, Prabhas fans to support Pawan, Prabhas support to Pawan Kalyan, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, భీమవరం అసెంబ్లీ, పవన్ కళ్యాణ్‌కు ప్రభాస్ మద్దతు, జనసేనకు ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు పవన్‌కే, భీమవరంలో కాపులు క్షత్రియులు

అందులోనూ ఈ నియోజకవర్గంలో వైసీపీ తరపున నిలుచున్న గ్రంథి శ్రీనివాస్ కూడా కాపుల్లో మంచి పట్టున్న నాయకుడే కాబట్టి పోటీ అంత ఈజీ కాదు. అందుకే పవన్ కు ప్రభాస్ ఫీవర్ పట్టుకుందట. గతంలో పాలకొల్లులో పోటీ చేసిన చిరంజీవి ఓ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం పవన్‌కు బాగానే గుర్తుంటుంది.

pawan vs prabhas కోసం చిత్ర ఫలితం

ఐతే.. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ప్రభాస్ తన ఫ్యాన్స్ కు పాత విబేధాలు పక్కకుపెట్టమని చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌ చేయమని ప్రభాస్ తన యూత్ ఫ్యాన్స్‌కు చెప్పారట. అదే నిజమైతే పవన్‌కు పెద్ద ఊరట లభించినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: