అధికారం అడ్డుపెట్టుకుని ఎన్నికల ముందు చంద్రబాబు సర్కారు చేస్తున్న ఆగడాలకు మరో ఉదాహరణ సీఐ గోరంట్ల మాధవ్ రిలీవ్ వ్యవహారం.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు నెలల ముందే రాజీనామా చేసినా.. రిలీవ్ చేయకుండా సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ కుట్రపన్నుతోంది. 
 

gorantla madhav కోసం చిత్ర ఫలితం

ఇక్కడ మరో విషయం గమనించాలి.. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు.. ఏపీఎన్జీవో ప్రెసిడెంట్ అశోక బాబు కి రెండు రోజులకు ముందే రిలీవ్ చేసింది ఇదే చంద్రబాబు సర్కారు.. ఆయన్ను  ఎమ్మెల్సిని చేసింది. కానీ మూడు నెలలు ముందు రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ గారిని అడ్డుకుంటోంది. 

ashok babu and chandrababu కోసం చిత్ర ఫలితం

ఈవిషయంలో కోర్ట్ ఆదేశాలు జారీ చేసినా రిలీవ్ చెయ్యకుండా కావాలనే ఇబ్బంది పెడుతున్న తీరు అసహ్యకరంగా ఉంటోంది. తెలుగుదేశం పార్టీ బిసిల పార్టీ ని చెప్పుకునే చంద్రబాబు..  మరి బిసి కులానికి చెందినటువంటి మాధవ్ గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ? ఈ విషయంలో బీసీలకు ఏమని సమాధానం చెప్పుకుంటారు..

gorantla madhav కోసం చిత్ర ఫలితం


వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసిలను బ్యాక్ వర్డ్ క్యాస్ట్ గా చూడకుండా బ్యాక్  బోన్ క్యాస్ట్ గా చూస్తుందంటున్నారు వైసీపీ నాయకులు. అందుకే ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు కంటే ఎక్కువగా దాదాపు 45 స్థానాలు వారికి కేటాయించామని చెబుతున్నారు.. ఈ ప్రశ్నకు తెలుగుదేశం దగ్గర సమాధానం ఉందా..? 



మరింత సమాచారం తెలుసుకోండి: