ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగింది. నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల జడివాన కురుస్తోంది. ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కాబోయే సీఎం ఎవరు మళ్లీ చంద్రబాబేనా.. లేక జనం ఈసారి జగన్‌ కు పట్టం కడతారా అన్న ఆత్రుత, ఆసక్తి అందరిలోనూ ఉన్నాయి. 

amalapuram politics కోసం చిత్ర ఫలితం


ఈ ఉత్కంఠకు కాస్త తెరదించేందుకు అనేక సర్వే సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ సర్వే సంస్థ ఆంధ్రావ్యాప్తంగా 100 నియోజకవర్గాలు సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా అమలాపురంతో పాటు 15 ఎంపీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఓ అంచనాకు వచ్చింది. అమలాపురం విషయానికి వస్తే.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ బరిలో ఉన్నాయి. 

amalapuram politics కోసం చిత్ర ఫలితం
అమలాపురం నియోజకవర్గంలో అమలాపురం, రామచంద్రాపురం, ముమ్మడివరం, రాజోల్, గన్నవరం, కొత్తపేట, మండపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అమలాపురం, రాజోల్  ఎస్సీ రిజర్వుడు స్థానాలు. ఈ సర్వే ప్రకారం అమలాపురంలో వైసీపీ చాలా బలంగా ఉంది. 

amalapuram కోసం చిత్ర ఫలితం

వైసీపీ ప్రధమ స్థానంలో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో జనసేన ఉంది. అధికార పార్టీ టీడీపీ  మూడో స్థానంలో ఉండటం విశేషం. ఇక్కడ వైసీపీ మెజారటీ 50 వేలు దాటుతుందని అంచనా. ఈ స్థానంలో వైసీపీ గెలుపు ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: